జర్నలిస్టులు కాదు చీటర్స్..! నకిలీ బిల్లులు సృష్టించి.. ప్రభుత్వ భూమిని కాజేసి…!! నల్లగొండలో వెలుగు చూసిన బ్యూరో చీఫ్, స్టాఫర్ల అవినీతి భూదందా.. ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాట్లు రద్దు చేసిన కలెక్టర్… మరి సహకరించిన అధికారులు, ఆ రిపోర్టర్లపై కేసులేవీ…? మేనేజ్‌మెంట్ ఉలుకుపలుకు లేదెందుకు..?
(దండుగుల శ్రీనివాస్) నిబంధనలను సాకు చూపారు. జీవోను అడ్డం పెట్టుకున్నారు. కోట్ల రూపాయల విలువ జేసే ప్రభుత్వ భూమిని కాజేశారు. నకిలీ బిల్లులు సృష్టించి ఇరిగేషన్‌కు చెందిన భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ఇప్పుడిదంతా బయటపడింది. ప్రభుత్వం కొరఢా పట్టుకుంది. వెంటనే…