దండుగుల శ్రీనివాస్
వాస్తవం ప్రధాన ప్రతినిధి

కెసిఆర్ అంటే జనాలకు ఓ గౌరవం ఉంది. పథకాల లబ్ది పొందామనే విశ్వాసమూ ఉంది. కానీ అధికార దర్పం తలకెక్కి అహంకారం అంతా తానై పాలన చేయడం జనాలకు నచ్చలేదు. అందుకే తల పొగరు దించారు. ఓడగొట్టారు. అహంకారాన్ని, అధికారాన్ని బండకేసి కొట్టారు. అయినా కెసిఆర్ లో మార్పు రాలేదు. కనువిప్పు కలగలేదు. ఎంత దాచుకుందామన్నా లోపలి మనిషి అప్పుడప్పుడు అలా వచ్చి పోయి తన రియల్ క్యారెక్టర్ ను బయటపెట్టుకుంటూ ఉంటాడు.

తాజాగా ఆయన బస్సు యాత్ర లో చేసిన ఓ కామెంట్ తీవ్ర విమర్శలకు తెర తీసింది. ‘ ఒకామె ఏరికోరి మొగుణ్ణి చేసుకుంటే ఆమెను వాడు ఎగిరెగిరి తన్నడంట’ అని కాంగ్రెస్ ను గెలిపించుకున్న జనాలను ఉద్దేశించి మాట్లాడాడు. తనను కాదని కాంగ్రెస్ ను తెచ్చుకున్నారు కదా… మంచిగయ్యిందా… మీకు ఈ శాస్తి జరగాల్సిందే… అనుభవించండి…. అని తన శాడిజాన్ని ఈ సామెత ద్వారా చెప్పాడు కెసిఆర్. తన లోపల జనాల మీద ఉన్న కసిని, కక్ష ను ఇలా కక్కుకున్నాడన్నమాట.

జనాలను ఇంకా వెర్రివెంగళప్పలే అనుకుంటున్నాడు కెసిఆర్. తనను మించిన తీస్మార్ ఖాన్ లేడని విర్రవీగిన ఈ దొరను ఓడగొట్టి బుద్ది తెచ్చుకొని ఇకనైనా సక్కగా మసులుకో అని జనం ఇచ్చిన తీర్పుకి ఇలాంటి వక్రభాష్యం చెప్పిన గులాబీ బాస్ కి అధికారం పోయిన విషాదాన్ని జీర్ణించుకోలేక మనసులో ఉన్న కచ్చను ప్రదర్శిస్తున్నాడు. కాళ్లిరిగినా నీకింకా బుద్ది రాలేదురా బై.. అని జనం ఈసడించుకునేలానే వుంది మాజీ సీఎం ప్రవర్తన..

You missed