నిర్లక్యం ఖరీదు ఓ ప్రాణం…

కలెక్టరేట్‌ పరిసర ప్రాంతం… రెండు నెలలుగా పనిచేయని సీసీ కెమెరాలు..

ఓ యువకుడికి ఢీకొట్టి వాహనం.. స్పాట్‌ డెడ్‌.. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని అప్పుడు తెలుసుకున్న పోలీసులు…

నిజామాబాద్‌- వాస్తవం:

కాలూరు వాసి ఆ అబ్బాయి. గోపికృష్ణ. నిజామాబాద్‌ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. నలుగురు పిల్లలు. అంతా చిన్న పిల్లలే. నిన్న ఖానాపూర్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద బైక్‌ పై కాలూరు వైపు వెళ్తుంటే ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. స్పాట్‌ డెడ్‌. పోలీసులు రంగం ప్రవేశం చేశారు. ఎలా జరిగిందో తెలుసుకున్నారు. అక్కడ అమర్చిన సీసీ కెమెరాల పుటేజీలు తెప్పించారు. ఆశ్చర్యం.. అవి పనిచేయడం లేదు. ఏకంగా రెండు నెలల నుంచి. పోలీసులు ముక్కు మీద వేలేసుకున్నారు. బయటకు చెబితే పరువు పోతుందనుకున్నారేమో.. గుర్తు తెలియని వాహన్ ఢీకొట్టిందని కేసు అలా బుక్‌ చేసి ఆ తతంగాన్ని ముగించారు. కోట్ల రూపాయలు పెట్టి కలెక్టరేట్ కట్టారు. రోడ్లు బాగు చేయించారు. ఆ చుట్టు పక్కల ఎవరూ మధ్యం తాగకుండా ఎప్పుడూ గస్తీ కాస్తున్నారు పోలీసులు. మరి ఆ చుట్టుపక్కల అమర్చిన సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో కూడా చూసుకోలేదా..? అంత నిర్లక్ష్యమా..? ఓ నిండు ప్రాణం ఆ నిర్లక్ష్యానికి బలైంది. ఓ భార్య.. నలుగురు పిల్లలు ఇప్పుడు అనాథ. ఎవరు దీనికి బాధ్యులు. కలెక్టరే చెప్పాలి సమాధానం. వారిని ఎవరు ఆదుకోవాలి… మంత్రే ఇవ్వాలి జవాబు…

You missed