Category: Political Gossips

బీఆరెస్‌ నిన్ను మట్టుబెట్టొచ్చు.. ఒక అమాయకుడు దొరల పన్నాగంలో బలి కావొద్దు..

నీ గురించి నువ్వు రాసుకునే ఈ రాతలు నీ బతుకుని ఆగం చేస్తయి ఎవరైనా తెలివైన, నీ మంచి కోరే మిత్రుల సలహాలు తీసుకో ఇలా రాసుకోవడం శంకర్ అమాయకత్వానికి పరాకాష్ట అసలే ఎన్నికల కాలం అధికారం కోల్పోయి బాధలో ఉన్న…

దాగుడు మూతల దండాకోర్‌..! సీబీఐ ఎదుట హాజరుకానన్న కవిత.. మోడీపై లేఖాస్త్రం..తాను ఎన్నికల ప్రచారంలో బిజీ.. ఎంపీగా పోటీచేయడం లేదని చెప్పకనే చెప్పిన కవిత.. నేరుగా హాజరైతే అరెస్టేనని తేలిపోయిన వైనం..వర్చువల్‌గా అయితే ఓకేనన్న ఎమ్మెల్సీ..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.. పార్లమెంటు ఎన్నికల వేళ కేంద్రం బీఆరెస్‌తో ఆడుకుంటోంది. కవిత ఢిల్లీ లిక్కర్‌ స్కాంకు ఫినిషింగ్ టచ్‌ ఇచ్చేందుకు సీబీ’ఐ’ నిఘా వేసింది. నోటీసుల పేరుతో ఆమెను రప్పించి అరెస్టుకు…

బీఆరెస్‌పై మోడీ ‘లిక్కర్‌ స్కాం’ అస్త్రం … కవితకు సీబీఐ నోటీసులతో కలకలం.. పార్లమెంటు ఎన్నికల వేళ.. మరింత ఇరకాటంలో పెట్టేందుకు కేంద్రం పావులు.. బీఆరెస్‌తో పొత్తు ప్రచారం నేపథ్యంలో తిప్పికొట్టేందుకు ఇదే సరైన సమయని భావన.. ‘కవిత అరెస్టు’తో గతంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నమా…? రెండు పార్టీల పోరును ఆసక్తిగా గమనిస్తున్న కాంగ్రెస్.. తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వలసలకు ఆహ్వానం..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా… అసలే కష్టాల్లో ఉన్న బీఆరెస్‌పై మోడీ దాడి మొదలైంది. పార్లమెంటు ఎన్నికల వేళ ఆ పార్టీని మరింత కిష్ట పరిస్థితులకు నెట్టేసేందుకు లిక్కర్‌ స్కాంను ఇక చివరి…

తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు.. కేటీఆర్‌ మారలే..ఇలా అయితే కష్టమే.. ఓటమిని అంగీకరించక.. లోపాలు ఒప్పుకోక.. పరనిందకు దిగితే…

రెండు సార్లు అధికారం ఇచ్చారు. మూడోసారి మార్పుకోవాల్సినవి ఎన్నో ఉన్నయ్‌.. సిట్టింగులను తలకెత్తుకుంటే వారే కొంప ముంచారు. ఓటమి తథ్యమని పదుల సార్లు చేపించుకున్న సర్వేలే చెప్పినా వారిని మార్చే ధైర్యం చేయలే. లేకపోతే ఎలాగైన చేసి గెలుస్తామని భ్రమల్లో మునిగి…

అసెంబ్లీకి రాం రాం.. ఎంపీగా పోటీకే కేసీఆర్‌ మొగ్గు.. ఎన్నికల ఫలితాలు గులాబీ నేతను కుంగదీసిన వైనం… ‘రేవంత్‌ అసెంబ్లీ’లో అడుగు పెట్టడం ఇష్టంలేక… ప్రజాతీర్పు నచ్చక.. పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారానికీ ఇష్టపడని కేసీఆర్‌.. మొత్తం కేటీయార్‌కే బాధ్యతలు.. మెదక్ పార్లమెంటు నుంచి పోటీ చేసి.. ఢిల్లీకే పరిమితమయ్యేందుకు నిర్ణయం..?

అసెంబ్లీకి రాం రాం.. ఎంపీగా పోటీకే కేసీఆర్‌ మొగ్గు.. ఎన్నికల ఫలితాలు గులాబీ నేతను కుంగదీసిన వైనం… ‘రేవంత్‌ అసెంబ్లీ’లో అడుగు పెట్టడం ఇష్టంలేక… ప్రజాతీర్పు నచ్చక.. పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారానికీ ఇష్టపడని కేసీఆర్‌.. మొత్తం కేటీయార్‌కే బాధ్యతలు.. మెదక్ పార్లమెంటు…

ప్రొటోకాల్‌ రగడ.. బాల్కొండ నుంచి పొలిటికల్‌ ఫైట్‌ ఆరంభం.. క్రిస్మస్‌ వేడుకల్లో మాజీ మంత్రి వేములకు చేదు అనుభవం.. ఫోటో లేదని, ప్రొటోకాల్‌ పాటించలేదని వేదిక మీదే ఎమ్మెల్యే అసంతృప్తి.. గతంలో మాదిరిగా వేడుకల్లో అధికారులు లేరెందుకు..? ప్రశ్నించిన మాజీ మంత్రి.. సునీల్‌ రెడ్డికి పరోక్షంగా గట్టి వార్నింగ్‌ ఇచ్చిన ప్రశాంత్‌రెడ్డి..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: అధికార పార్టీపై ప్రధాన ప్రతిపక్షం దాడి మొదలైంది. మొన్నటి ఎన్నికల్లో జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఓటమి పాలైన బీఆరెస్‌.. ఒక్క బాల్కొండలోనే గెలిచింది. బీఆరెస్‌కు జిల్లా కంచుకోటలా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. సిట్టింగులు ఓడారు.…

ఓ ఓబులాపురం.. ఓ కేజీఎఫ్‌ సినిమా.. ఆర్మూర్‌ అక్రమగనుల తవ్వకాలపై మంత్రికి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి.. ఓబులాపురం గనుల తవ్వకాలను తలపించేలా అంకాపూర్‌లో క్వారీలు.. కేజీఎఫ్‌ సినిమాను తలపించేలా నాయకులు దోచుకున్నారంటూ మంత్రికి వివరించిన ఎమ్మెల్యే.. ఆర్మూర్‌లో అక్రమ మైనింగ్‌పై ఎంక్వైరీకి ఆదేశించిన మంత్రి..

వాస్తవం- నిజామాబాద్‌: ఆర్మూర్‌ నియోజకవర్గంలోని అంకాపూర్‌లో ఓ ఓబులాపురం గనుల తవ్వకాలకు మించి, కేజీఎఫ్‌ సినిమాను తలపించేలా క్వారీలు, గనుల తవ్వకాలు అక్రమంగా నడుస్తున్నాయని ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి క్రిష్టారావుకు ఫిర్యాదు చేశారు. ప్రజాపాలన…

షకీల్‌ వెనుకే శని.. వెంటాడుతున్న సంఘటనలు.. ఓటమి తరువాత వరుసగా ఎదురుదెబ్బలు.. మొన్న రైస్‌మిల్లులపై దాడులు చేయించిన శరత్‌రెడ్డి.. తాజాగా కొడుకు కారు ఆక్సిడెంట్‌తో మళ్లీ చిక్కుల్లో షకీల్‌.. పలు సెక్షన్ల కింద కొడుకుపై కేసులు నమోదు.. దుబాయ్‌కు పారిపోయిన సోహిల్‌..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: బోధన్‌ మాజీ ఎమ్మెల్యేకు శని వెంటాడుతోంది. నిను వీడని నీడను నేనే అనే విధంగా వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రాజకీయంగా అతనికి ఇబ్బందులు, కొత్త తలనొప్పులు, తలవంపులు తెచ్చిపెడుతున్నాయి. ఓటమి తరువాత వరుసగా…

మా మాట వినకపోతే.. ఖబడ్దార్‌.. వారు ఓడిన ఎమ్మెల్యేలు కాదు.. అధికారం చెలాయిస్తున్న ‘మాజీ’లు.. ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలను కాదని వీరిదే ఇష్టారాజ్యం.. పోలీసులతో మీటింగులు… మేం చెప్పినట్టు వినాలని హుకుం.. అధికారులను గుప్పిట్లో ఉంచుకునేందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్న వైనం.. కాంట్రాక్టర్లు మాకే కమీషన్లు సమర్పించాలి… ముప్పుతిప్పలు.. ఇదీ అధికార పార్టీ ఓడిన ఎమ్మెల్యేల జులుం.. వినయర్‌రెడ్డి, ముత్యాల సునీల్‌ రెడ్డి ఇద్దరూ దొందు దొందే.. కాంగ్రెస్‌లో ఇదో పడగవిప్పిన విచిత్ర, దారుణ వైఖరి.. (వాస్తవం ఎక్స్‌క్లూజివ్‌)

దండుగుల శ్రీనివాస్‌, వాస్తవం ప్రతినిధి: (వాస్తవం ఎక్స్‌క్లూజివ్‌) వారిద్దరూ ఓడారు. కానీ అధికారం మాత్రం వీరే చెలాయిస్తున్నారు. పోలీసులను బెదిరిస్తారు. మీటింగులు పెట్టి వార్నింగులు ఇస్తారు. మా మాటే చెల్లుబాటు కావాలని హుకుం జారీ చేస్తారు. అధికారులు మా ఫోన్లకే స్పందించాలంటారు.…

ఎంపీ సీటు కోసం క్యూ… కాంగ్రెస్‌లో పెరుగుతున్న ఆశవాహుల సంఖ్య.. అధిష్టానం అవకాశం ఇస్తే పోటీ సై అనే సంకేతాలిస్తున్న ఇందూరు నేతలు.. జిల్లా అధ్యక్షుడు మానాల తోపాటు అనిల్‌, మహేశ్‌కుమార్‌ గౌడ్‌, తాహెర్‌, అరికెల, నగేశ్‌రెడ్డి…

దండుగుల శ్రీనివాస్‌, వాస్తవం ప్రతినిధి: నిజామాబాద్‌ ఎంపీ సీటు కోసం నేతలు క్యూ కట్టారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో పెరిగిన జనాధరణ, ప్రభుత్వం ఏర్పాటుతో కొత్త జోష్‌లో ఉన్న కాంగ్రెస్‌ నేతల కన్ను ఇప్పుడు ఎంపీ సీటు పై పడింది. ఓ వైపు…

You missed

అర్వింద్‌ ‘పసుపు’ రాజకీయం.. మళ్లీ తెరపైకి బాండుపేపర్.. రెండేండ్లలో టన్నుకు 20వేలు ఇస్తానని ప్రకటన… మళ్లీ అవే ‘బాండ్‌’ అబద్దాలతో ఎంపీ రైతుల చెవిల్లో పసుపు… ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. ప్రస్తుతం పసుపు క్వింటాళ్‌కు 14వేల పై చిలుకు ధర పలుకుతున్న వైనం.. ఎందుకు ఇంత రేటు పెరిగిందో తెలియని నేతల అవగాహనారాహిత్యం.. 70వేల ఎకరాల నుంచి సాగు విస్తీర్ణం సగానికి పడిపోయిన వైనం.. పెరిగిన ఎగుమతి డిమాండ్.. చాలా మంది రైతులు పసుపు పండిచేందుకు వెనుకడుగు.. దీనికి ఎవరు కారణం.. ? పసుపుబోర్డు తెస్తానని ఐదేండ్లు కాలయాపన చేసి ఫలితంగా పసుపు ‘సాగు’ బంగారమయిన దుస్థితి.. రేవంత్‌ కూడా బీజేపీకి మైలేజీ ఇచ్చేలా అవగాహనారాహిత్యపు ట్వీట్‌… మళ్లీ బాండ్‌ పేపర్‌ రాస్తానని బరితెగించిన చెప్పిన అర్వింద్.. కానీ బీఆరెస్‌, కాంగ్రెస్‌ నేతల్లో చలనం లేని రాజకీయ నిస్తేజం.. ‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌….