నాకివే లాస్ట్ ఎన్నికలు..

జీవన్‌రెడ్డి సానుభూతి అస్త్రం..

లోకల్‌లోనే ఉంటా.. జిల్లాను అభివృద్ధి చేస్తానన్న జీవన్‌రెడ్డి..

తాజాగా తన జీవిత చరమాంక ఎన్నికలుగా డిక్లేర్‌.. ఎంపీగా గెలిపించాలంటూ ప్రచారం..

(దండుగుల శ్రీనివాస్‌)

కాంగ్రెస్‌ అందివచ్చిన… అవకాశమున్న దేన్నీ వదలడం లేదు. బీజేపీని నిలువరించి.. గెలుపు తీరాలకేగేందుకు అన్నీ ప్రయోగాలు చేస్తున్నది. ఓ వైపు తాజాగా ప్రత్యేక మ్యానిఫెస్టోతో గడపగడపకు పోవాలని చూస్తున్న కాంగ్రెస్‌…. లోకల్‌ మైలేజీ పాయింట్లు, సెంటిమెంటు, సానుభూతి అంశాలను కూడా ప్లే చేస్తున్నది. నిజామాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి జీవన్‌రెడ్డి ప్రచార సరళే దీనికి నిదర్శనం. ఎక్కడెక్కడ తనకు, పార్టీకి మైనస్‌ పాయింట్లున్నాయో దాన్ని తగ్గించుకుని వ్యూహాత్మకంగా ప్రత్యర్థిని ఓడించి గెలిచేందుకు ప్రచారంలో శక్తియుక్తులు ప్రదర్శిస్తున్నది.

బీజేపీ తనను నాన్‌ లోకల్‌ ముద్రవేసి కీలకమైన ఇందూరుకు చెందిన ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో దెబ్బకొట్టాలని చూస్తున్న వైనాన్ని పసిగట్టింది.అందుకే ఆయన తన ప్రచారంలో ఇక్కడ ఉంటా.. ఇందూరూలోనే ఉంటా.. జిల్లాను అభివృద్ధి చేస్తా.. అంటూ చంటి లోకల్‌ డైలాగులు చెప్పడం ప్రారంభించాడు. తాజాగా ఇంకో సానుభూతి అస్త్రాన్ని కూడా తీశాడు జీవన్‌రెడ్డి. తనకివి జీవిత చరమాంక ఎన్నికలని డిక్లేర్‌ చేసుకున్నాడు. అంటే ఇవే చివరి ఎన్నికలుగా జనాలు అనుకోవాలని పరోక్షంగా ఇలా హింట్‌ ఇచ్చి సింపతీని వాడుకునే ప్రయత్నమూ చేస్తున్నాడు.

ఒక్కచాన్స్‌ అంటూ జనాలను రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఇలా రోజు రోజుకు కాంగ్రెస్‌ కొంగొత్త ఆలోచనలు, జనాలను ఆకర్షించి ఆకట్టుకునే ప్రయత్నాలు, సెంటిమెంట్‌, సానుభూతి ప్రయోగాలు చేస్తూ పోతోంది. జనం ఎంత వరకు రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి.

You missed