ఎమ్మెల్సీ కవిత రాజకీయాల్లో బిజీ బిజీ.. ఎప్పుడూ జనం మధ్యే. ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లిన జన సందోహమే. ఇంత బిజీలో ఉండి కూడా ఆమె ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్‌ మరవలేదు. బాధ్యతనూ విడవలేదు. తన పుత్రుడు చదువు ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంది. ఈ రోజు స్పెషల్‌గా అందరితో పాటు తన కొడుకూ వేసిన ప్రాజెక్టు వర్క్‌ చూడాలనుకుంది. నేరుగా కొడుకు చదువుకునే పాఠశాలకు వెళ్లింది ఆమె ఓ సాధారణ మహిళగా. ఓ మాతృమూర్తిగా. అందరి విద్యార్థులతో పాటు తన కొడుకూ వేసిన ప్రాజెక్టు వర్క్‌ను ఆసక్తిగా తిలకించిందామె. ఆ తల్లి మనసు పులకించింది. తన కొడుకు ఆ ప్రాజెక్టు వివరాలు తనకు వివరిస్తున్నతరుణంలో. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటారు. ఎంత ప్రముఖ రాజకీయ నాయకురాలైనా తనూ ఓ తల్లే. అందుకే ఆ తల్లి మనసు పులకించింది. పుత్రోత్సాహం పరిఢవిల్లింది. .

 

తన కుమారుడు ఆర్య పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు వర్క్ లను ఆసక్తిగా పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్:

పర్యావరణ పరిరక్షణ వంటి అనేక అంశాలపై విద్యార్థులు అద్బుతమైన ప్రాజెక్టులు రూపొందించారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తన కుమారుడు ఆర్య పాఠశాలకు వెళ్ళిన ఎమ్మెల్సీ కవిత, విద్యార్థులు రూపొందించిన అనేక రకాల ప్రాజెక్ట్ వర్క్ లను ఆసక్తిగా పరిశీలించారు. పర్యావరణం, జంతు సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ వంటి అనేక అంశాలపై విద్యార్థులు చేసిన ప్రాజెక్టు వర్క్ లను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. కుమారుడు ఆర్య చేసిన ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఒక తల్లిగా గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు.

You missed