ఎస్సారెస్పీ దిగువన మెండోరా మండల కేంద్రం వద్ద శుక్రవారం సాయంత్రం ఇద్దరు యువకులు ఎస్సారెస్పీ కాకతీయ కాలువలోకి దిగి గల్లంతయిన విషాదకర ఘటన చోటుచేసుకుంది . నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బి.టెక్ విద్యార్థులు వేణు, ప్రణవ్ జిల్లాలోని ఎస్సారెస్పీ సందర్శనకు వచ్చారు. ప్రాజెక్టు సమీపంలోని మెండోరా మండల కేంద్రంలోని కాకతీయ కాలువలోకి దిగి గల్లంతయ్యారు.
సమాచారం అందిన పోలీసులు శుక్రవారం సాయంత్రం నుండి వీరి ఆచూకీ కోసం కాకతీయ కాలువలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. గల్లంతయిన ఈ ఇద్దరు యువకులు జిల్లా కేంద్రం నిజామాబాద్ లోని గాయత్రీ నగర్ సాయి నగర్ చంద్ర రోడ్డు కాలనీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో యువకుల కుటుంబాల్లో విషాదం రోదనలు నెలకొన్నాయి.