ఇందూరు బిడ్డకు అరుదైన గౌరవం లభించింది. రాజకీయాలకు అతీతకంగా తనదైన శైలిలో అందిరినీ కలుపుకుపోతూ.. విద్యార్థి నాయకుడిగా ఆ విద్యార్థిలోకానికి స్పూర్తిదాయకంగా నిలిచిన ఆర్‌ లింబాద్రికి కీలక పదవి దక్కింది. మొన్నటి వరకు ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఇన్చార్జిగా ఉన్న ఆర్‌ లింబాద్రికి పూర్తి స్థాయిలో చైర్మన్‌గా మూడేండ్ల పాటు అవకాశం ఇస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆర్‌ లింబాద్రి సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన వాడు. దళితుడు, వివాదరహితుడు, అజాత శత్రువు, విద్యార్థి దశలో పీడీఎస్‌యూలో పనిచేశాడు.

ఆర్మూర్‌ డివిజన్‌లో రైతు కూటీ సంఘంలో క్రియాశీలకంగా పనిచేశాడు. ఎంఏ ఉస్మానియా పబ్లిక్ అడ్మినిష్ట్రేషన్‌,.. ప్రొఫెసర్‌గా పనిచేస్తూ సికింద్రాబాద్‌ పీజీ కాలేజీకి వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేశాడు. తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా పనిచేశాడు. ఉన్నత విద్యామండలి సభ్యుడిగా కొద్ది రోజులుగా పనిచేశారు. ఆ తర్వాత ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఇన్‌చార్జిగా రెండేళ్లుగా పనిచేశారు. ఇతనికి పూర్తి స్థాయిలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఇవ్వడం పట్ల విద్యావేత్తలు, విద్యార్థిలోకం హర్షం వ్యక్తం చేస్తుంది. అవినీతిరహిత పాలనలో తనదైన ముద్రవేసుకుని పెద్దల మన్ననలు పొందారు.

You missed