వాస్తవం ప్రధాన ప్రతినిధి- నిజామాబాద్‌ :

ఆర్మూర్‌ నుంచి వినయ్‌రెడ్డికి చుక్కెదురుకానుంది. బీజేపీ వాళ్లు గెంటేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా మాకొద్దంటున్నది. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ సాధించిన పొద్దుటూరి వినయ్‌రెడ్డి ఈ సదావకాన్ని వినియోగించుకోలేదు. అక్కడ జీవన్‌రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఎవరు గట్టి క్యాండిడేట్‌ వస్తే వారిని గెలిపించాలని ప్రజలంతా డిసైడ్ అయి ఉన్నారు. అదే సమయంలో బీఆరెస్‌పై వ్యతిరేకత కూడా పెరిగింది. ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని ప్రజలు స్థిర నిశ్చయానికి కూడా వచ్చారు. కానీ ఇంత పాజిటివ్‌ వాతావారణాన్ని వినయ్‌ సద్వినియోగం చేసుకోలేదు.

అవగాహన రాహిత్యం, రాజీకయ పరిపక్వత లేకపోవడం, లౌక్యం తెలియకపోవడం అతన్ని ఓడించారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడటంతో వినయ్‌కి బూస్టింగ్‌ దొరికింది. తానే షాడో ఎమ్మెల్యే అయ్యాడు. అంతా తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నాడు. అధికారులను బెదిరించాడు. పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. అంతా తాను చెప్పినట్టే చేయాలన్నాడు. తనే ఎమ్మెల్యేనన్నాడు. మాజీ మంత్రి, జిల్లా కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు సుదర్శన్‌రెడ్డి కూడా వినయ్‌కు వంత పాడాడు. కానీ సీఎం రేవంత్‌ దృష్టిలో వినయ్‌ మైనస్‌గా నిలిచాడు.

పార్లమెంటు ఎన్నికల్లో గెలుపును రేవంత్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు. దీంతో ఆర్మూర్‌కు వినయ్‌ పనికిరాడని తేల్చేశాడు. ఇక్కడ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను నియమించాలని డిసైడ్ చేశాడు. అతనే ఇక అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి. పార్లమెంటు ఎన్నికల తరువాత ప్రకటిస్తారు. కానీ ఈ ఎన్నికల్లో అంతా తానై ఆర్మూర్ నియోజకవర్గంలో తన ముద్ర వేసుకోనున్నాడు మహేశ్‌. ఆ తరువాత ఆయనే అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్‌. వినయ్‌కు ఇక చెక్‌ పడినట్టే. కాలం కలిసి రావడం లేదు పాపం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed