నమస్తే తెలంగాణ… అధికార పార్టీ పత్రిక. ఎడిటర్లుగా అల్లం నారాయణ, కట్టా శేఖర్‌ రెడ్డిలు ఉన్నప్పుడు ఆ పత్రిక గురించి ఎలాంటి ఫిర్యాదులు లేవు. అదో ఉద్యమ పత్రిక. దాన్ని నమ్ముకుని చాలా మంది తెలంగాణ జర్నలిస్టులు ముందుకు వచ్చారు. తక్కువ వేతనాలకు పనిచేశారు. కష్టపడి దాన్ని ఓ స్థాయికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అల్లం నారాయణను ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా నియమించిన కేసీఆర్‌… అప్పటి వరకు ఆ సంస్థకు సీఈవోగా పనిచేస్తున్న కట్టా శేఖర్‌ రెడ్డిని ఎడిటర్‌గా చేశాడు. అంతా బాగానే నడిచింది. జీతాలు పెంచకున్నా పత్రిక ఎదుగుదలకు నమస్తే తెలంగాణ జర్నలిస్టులు పనిచేస్తూ వచ్చారు. ఆ తర్వాత కట్టా శేఖర్‌ రెడ్డి సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా పంపి ఎడిటర్‌గా కృష్ణమూర్తిని తెచ్చిపెట్టుకున్నాడు కేసీఆర్‌. అప్పటి నుంచి మొదలయ్యింది అందులో పనిచేసే జర్నలిస్టుల బాధలు. కరోనా అని కూడా చూడకుండా తన వర్గాన్ని తెచ్చిపెట్టుకునేందుకు, కట్టా శేఖర్‌ రెడ్డి వర్గమని, అల్లం నారాయణ వర్గమని ముద్రవేసి జర్నలిస్టులందరినీ ఒక్కొక్కరినీ సాగనంపుతూ వచ్చాడు కృ.తి. వందల మంది జర్నలిస్టులు రోడ్డు పడ్డారు. కేసీఆర్‌, కేటీఆర్‌ పట్టించుకోలేదు.

ఈ పరంపర ఇంకా కొనసాగుతనే ఉంది. వీటిపైనే వాస్తవం వరుసక కథనాలను అందించింది. ఇది ఆ పత్రిక పరువును దిగజార్చే విధంగా ఉందంటూ.. వాస్తవం వెబ్‌ మీడియాపై నమస్తే తెలంగాణ యాజమాన్యం సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. డీ చిరంజీవి అనే వ్యక్తి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడని ఎస్సై శరత్‌ తెలిపాడు. క్రైమ్‌ నెంబర్‌ 2412 ఆఫ్‌ 2022 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపాడు.య వందల మంది జర్నలిస్టుల జీవితాలు రోడ్డు పాలైంది నిజం కాదా..? హైదరాబాద్‌లోని నమస్తే తెలంగాణ ఆపీసు వద్దకు వచ్చి బాధితులంతా ధర్నా చేద్దామని అనుకున్న తరుణంలో వారికి రెండు నెలల జీతాలిచ్చి వెళ్లగొట్టింది నిజం కాదా..? ఇప్పటికీ పత్రికలో పాతవారిని పొమ్మనలేక పొగబెట్టిన చందంగా కక్షపూరితంగా బయటకు పంపిస్తున్నది వాస్తవం కాదా..? పత్రిక పరువును ఎవరు దిగజారుస్తున్నారో తెలియజెప్తే.. అది వాస్తవం వెబ్‌ సైట్‌ మీడియా చేసిన తప్పా..? అందుకే కేసు పెట్టారు. ఇక ముందు కూడా పెడతారు. నిజాలు రాస్తే కేసులే పెడతారు.జైలుకే పంపుతారు. జరుగుతున్నదిది.. జరగబోయేది ఇంకా మిగిలే ఉంది.

You missed