దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: కవితను రాజకీయంగా దూరం చేశారు. జనానికి మరింత గ్యాప్‌ పెంచారు. ప్రత్యక్ష రాజకీయాలకు మరింతగా దూరం దూరం పెంచారు. ఇప్పట్లో ఆమెకు బెయిల్ వచ్చేలా లేదు. జైలులోనే ఉండేలా ఉంది. బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేసినా అది సఫలం కాలేదు. కానీయడం లేదు బీజేపీ సర్కార్‌. కవిత అరెస్టు బీజేపీకి ఎంత మైలేజీ ఇస్తుందో తెలియదు కానీ, బీఆరెస్‌కు మాత్రం అణుమాత్రం ఉపయోగం లేకుండా ఉంది.

ఆమెను జైలుకు పంపితే తమకు సానుభూతి దొరుకుతుందని భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఉల్టా అయ్యాయి. ఆమె పేరును ఉచ్చరించడానికే భయపడుతున్నారు. ఆమె ప్రస్తావనే లేకుండా ప్రచారం చేసుకుంటున్నారు. జైలుకు పంపడం అన్యాయమనే మాటే లేదు. మొత్తానికి కవిత లేకుండానే ఇందూరు రాజకీయాలు ఇలా సాగిపోతున్నాయి. యాభై రోజుల పాటు ఆమె జైలులోనే ఉంది. ఇది ఎవరూ ఊహించని పరిణామం.

కేసీఆర్‌ ఇందూరు రోడ్‌ షోలో కూడా కవిత ప్రస్తావన పెద్దగా తీయకపోవడం గమనార్హం. తను మోడీకి అడ్డుగా ఉన్నానని, చెబితే వినలేదని కవితను జైలులోపెట్టారని మాత్రమే అన్నాడు. కానీ ఆమె మార్కు రాజకీయం జిల్లాలో ఎలా ఉంది..? అనే విషయంలో సానుభూతిని పొందే ప్రయత్నం జరగలేదు. సానుభూతి వచ్చేలా లేదని గ్రహించాడో, అది తనకు హుందాతనాన్ని ఇవ్వదని భావించాడో తెలియదు కానీ మొత్తానికి కవితని రాజకీయాలకే కాదు.. జిల్లాకు, జనాలకు దూరం చేశారు. మరింత దూరం పెంచారు. పెంచుతూనే ఉన్నారు.

 

You missed