. దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

కేసీఆర్‌ మారాడా..? పశ్చాత్తాప పడుతున్నాడా…?? అవును.. మొన్నటి వరకు తన ఓటమిని అంగీకరించకుండా అది జనాల అత్యాశ వల్లే జరిగిందని సమర్థించుకున్న కేసీఆర్‌ ఇప్పుడు తన బాణి మార్చాడు. అసెంబ్లీలో తనను ఓడించారు.. బాధలేనది ఒప్పుకున్నాడు. ఓటమిని అంగీకరించాడు. నిజామాబాద్‌ రోడ్‌ షోలో ఆయన స్పీచ్‌లో ఈ పశ్చాత్తాప వ్యాఖ్యానాలు అలా వచ్చి ఇలా వెళ్లాయి.

ఎక్కడ ఏ మీటింగు జరిగినా.. జనాల మీదకే నెపం నెట్టాడు కేసీఆర్‌. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలకు జనాలు అత్యాశకు పోయారనివారిపై నిందనేశాడు. అదే అహంకారాన్ని ప్రదర్శిస్తూ తన లోపాలను గుర్తించేందుకు ఏమాత్రం సాహించలేదు. ఇష్టపడలేదు. కానీ ఇందూరు సభకు వచ్చే సరికి కొంత మార్పు కనిపించింది. అసెంబ్లీలో తాము ఓడిపోయాం.. బాధలేదు.. కానీ పార్లమెంటులో 14 సీట్లు గెలిపించండి.. పోరాడుతాం.. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా పోరాడాలంటే బీఆరెస్‌ను గెలిపించి బలపర్చండని ఆయన ప్రజలకు అప్పీల్ చేసుకున్నాడు. పనిలో పనిగా ఇందూరు ఉద్యమ గురుతులను యాది చేసుకున్నాడు.

తాను గులాబీ జెండా ఎత్తినప్పుడు తనతో నడిచి పూర్తిగా వెన్నుదన్నుగా నిలిచింది ఇక్కడి జనాలనని గుర్తు చేసుకున్నాడు. ఉద్యమ నాటి జ్ఞాపకాలతో సెంటిమెంట్‌ను రాజేసే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి పదేండ్ల అధికారంలో ఆయనేనాడు ఇక్కడ ఉద్యమకారులను పట్టించుకోలేదు. వారి బతుకులు మారలేదు. మరింత దుర్బరంగా మారాయి. మధ్యలో వచ్చినోళ్లు.. పదవులు అనుభవించినోళ్లు కేసీఆర్‌ కష్టకాలంలో ఉండగా ఏమాత్రం సానుభూతి చూపకుండా పారిపోయాడు. ఇప్పుడు మళ్లీ కేసీఆర్‌ ఉద్యమకారుల మాటను తీసుకున్నాడు. బతికున్నంత కాలం నిజామాబాద్‌ను మరవనని, ఇక్కడ ఉద్యమ గురుతులు యాదుంచుకుంటానని అన్నాడు. ఇక ఉద్యమకారులకు మంచి రోజులేననే పరోక్ష సిగ్నలైతే ఇ

You missed