దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: రాష్ట్రం అసమర్ధుల పాలనలో ఆగమాగమయిందని బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. కామారెడ్డి రోడ్‌ షోలో ఆయన మాట్లాడాడు. ఎన్నో పథకాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఏమీ ఇయ్యలేదన్నాడు. వాళ్లు పెంచి, అదనంగా ఇచ్చే పథకాలు ఇవ్వకపోగా.. బీఆరెస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చే రైతుబంధు కూడా సరిగా సమయానికి ఇవ్వడం లేదన్నాడు.

రైతుబంధును ఐదెకరాలకే పరిమితం చేస్తున్నారన్నాడు. మోడీ మళ్లా వస్తే పెట్రోల్‌, డీజీల్‌ ధరలు 400కు పెరగడం ఖాయమన్నాడు. దేశం మనది పిచ్చి పిచ్చిగా ఆలోచించి ఓట్లు వేయొద్దని పరోక్షంగా బీజేపీకి ఓటు వేయొద్దని కేసీఆర్‌ కోరాడు. జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ మూడోస్థానానికి పడిపోయాడని బీజేపీ పరిస్థితి అంతటా ఇట్లనే ఉందన్నాడు. రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే అన్నాడు కేసీఆర్‌. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ మెడలు వంచి అమలు చేయించుకోవాలంటే బీఆరెస్‌ అభ్యర్థులనే గెలిపించాలని కోరాడు.

You missed