Category: Local News

టికెట్‌ ఇస్తే గెలవాలి కదా…! భాస్కర్‌రెడ్డిపై ‘ఏనుగు’ కామెంట్‌..!!

వాస్తవం- బాన్సువాడ: పోచారం భాస్కర్‌రెడ్డికి టికెట్‌ ఇస్తే బాన్సువాడలో గెలవడని, అంత సీన్‌ లేదని కాంగ్రెస్‌ లీడర్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి కామెంట్‌ చేశాడు. ఆయన వాస్తవం ప్రతినిధితో మాట్లాడాడు. పోచారం కాంగ్రెస్‌లోకి వచ్చిన నేపథ్యంలో ఆయనను పలకరించగా.. కాంగ్రెస్‌ పార్టీ వీరినే…

థర్డ్‌ డిగ్రీ తట్టుకోలేక..! పోచారం అండ్‌ సన్‌ ను వెంటాడిన ఏనుగు రవీందర్‌రెడ్డి..!! ఎమ్మెల్యేగా గెలిచినా పెద్దనమంతా ఏనుగుదే… పోచారం ఫ్యామిలీని అష్టదిగ్భంధనం చేసిన వైనం.. భాస్కర్‌రెడ్డిపై ప్రతీకారేచ్చతో రగిలిపోయిన రవీందర్‌రెడ్డి.. ఓ కానిస్టేబుల్‌ కూడా మాట వినని దౌర్బాగ్య పరిస్థితి అక్కడ.. అందుకే కాంగ్రెస్‌ గూటికి.. రెడ్డి లాబీయింగ్‌తో లాభపడ్డ పోచారం.. ‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌ కథనం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో: ఏనుగు రవీందర్‌రెడ్డి పెట్టే టార్చర్‌ భరించలేకపోయాడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అతని తనయుడు భాస్కర్‌రెడ్డి. పోలీసులు పెట్టే థర్డ్‌ డిగ్రీని తలపించింది ఏనుగు ప్రతీకారేచ్చ..! ఎమ్మెల్యేగా గెలిచినా సుఖం లేకుండా పోయింది ఇద్దరికీ. మంత్రిగా,…

కొడుకు కోసం..! కేసీఆర్‌కు ‘చేతి’చ్చిన పోచారం..!! భాస్కర్‌రెడ్డికి ఎమ్మెల్యే టికెట్‌ ఆఫర్‌తో పార్టీ మారిన శ్రీనివాస్‌రెడ్డి.. మంత్రి పదవికి నో ఛాన్స్‌.. కాంగ్రెస్‌లో తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా.. కొడుకు రాజకీయ భవిష్యత్‌పై హామీ మాత్రమే ఇచ్చిన అధిష్టానం..! ముందే చెప్పిన ‘వాస్తవం’

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో: పోచారంకు ‘సన్‌’ స్ట్రోక్‌ తగిలింది. కొడుకు భాస్కర్‌రెడ్డి కోసం పార్టీ మారక తప్పలేదు. కేసీఆర్‌ కు చేతివ్వక తప్పలేదు మరి పెద్దమనిషి. రిటైర్‌మెంట్‌ పాలిటిక్స్‌లో ఆయనకు రాజకీయంగా చెడ్డపేరే మిగిలింది. ఇప్పుడు పేరెవరికి…

అర్బన్‌ ‘రాజకీయం’లో రేవంత్‌ రెడ్డి జోక్యం…!! అర్బన్‌పై పట్టుకు షబ్బీర్‌ను ఎగదోస్తున్న వైనం.. ! మహేశ్‌ను నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి దూరం చేసేందుకు సీఎం పన్నాగం.. !! అందుకే షబ్బీర్‌ క్యాంప్‌ ఆఫీసు ఏర్పాటు కలెక్టర్‌తో సమీక్షలు.. గ్రూపు రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన నిజామాబాద్‌ అర్బన్‌ కాంగ్రెస్‌..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం బ్యూరో చీఫ్‌: మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను అర్బన్‌ రాజకీయం నుంచి దూరం చేసేందుకు సీఎం రేవంత్‌ ఎత్తులు వేస్తున్నాడు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కు, సీఎం రేవంత్‌ రెడ్డికి మధ్య చాలా గ్యాప్‌ ఉంది. గత అసెంబ్లీ…

‘అధికార’ మదంపై బీజేపీ కదం..! షబ్బీర్‌ అలీ అధికారులతో సమీక్షపై విరుచుకుపడ్డ ధన్‌పాల్‌.. వినయ్‌రెడ్డి అవినీతిపై వార్నింగ్‌ ఇచ్చిన రాకేశ్‌రెడ్డి.. నేను లేకుండా ఏ హోదాలో సమీక్ష జరిపావ్‌..! అంటూ షబ్బీర్‌పై అర్బన్‌ ఎమ్మెల్యే ధ్వజం.. డబ్బులిచ్చి ఆర్మూర్‌కు వస్తే అంతే సంగతులు.. జాగ్రత్త..! అంటూ రాకేశ్‌ అల్టిమేటం.. ఒకేరోజు జిల్లాలో రెండు సంఘటనలు.. కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసిన వైనం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో: ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు. ఒకరు ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి. మరొకరు నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ. మరో ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఈ నియోజకవర్గాల నుంచే పోటీ చేసిన ఎమ్మెల్యే…

పంద్రాగష్టు తర్వాతే మంత్రివర్గ విస్తరణ..!! పార్టీలో చేరికల కోసం మరింత జాప్యం.. పాపం..! సుదర్శన్‌రెడ్డి.. ఈసారీ జెండా ఎగురేసే భాగ్యం లేదా.. ఇందూరు రాజకీయాల్లో ఇదో చర్చ.. సీనియర్‌ నేతకు అన్నీ అడ్డంకులే.. రిటైర్డ్‌ పాలిటిక్స్‌లో అనుకూలించని కాలం.. బీఆరెస్‌ మాజీ మంత్రి పార్టీలో చేరుతున్నాడనే వార్తతో మరింత గందరగోళం..

దండుగుల శ్రీనివాస్‌ – తెలంగాణ బ్యూరో మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యమయ్యేలా ఉంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంతా భావించారు. కానీ పంద్రాగస్టు తరువాత గానీ దీనిపై క్లారిటీ వచ్చేలా లేదు. కొందరు కీలక నేతలను…

బీఆరెస్‌ మాజీ మంత్రికి మంత్రి పదవి ఆఫర్‌..!! జిల్లా నుంచి ఒకరిని లాగేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం తీవ్ర కసరత్తులు.. పార్టీని పటిష్ట పర్చడం, జిల్లాపై పూర్తి పట్టుకోసం యత్నాలు… సుదర్శన్‌రెడ్డికి బదులు బీఆరెస్‌ మాజీ మంత్రికి ఇచ్చేందుకు సిద్దం.. ప్రాధాన్యత గల శాఖ కేటాయింపునకు కూడా సిద్దం… మారనున్న జిల్లా రాజకీయ సమీకరణలు.. ‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌ కథనం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో: మంత్రివర్గ విస్తరణలో కొత్త ముఖాలు కనిపించనున్నాయి. ఇప్పటి వరకు వేసుకున్న సమీకరణలు మారనున్నాయి. పార్టీని మరింత బలపర్చేందుకు, ప్రతిపక్షాలను సమర్థవంతంగా ఎదుర్కొనేవిధంగా తయార్యేక్రమంలో కొత్త వారిని ఎంకరేజ్‌ చేస్తున్నది కాంగ్రెస్‌ అధిష్టానం. సీఎం…

కిస్సా పైసా కా..! రచ్చకెక్కిన పైసల పంపిణీ లొల్లి.. !! నువ్వింత పంచావంటే నువ్వింత పంచావంటూ బీజేపీ, కాంగ్రెస్‌ల కుమ్ములాట ! ఇందూరు రాజకీయాల్లో ఇప్పుడిదో కొత్త చర్చ.. ఒకరిపై మరొకరు మాటల దాడులతో పలుచన.. అర్వింద్ అసందర్భ ప్రేలాపన… కాంగ్రెస్‌ కవ్వింపు చర్యలు.. దొందూ దొందే.. ఎన్నికల కమిషన్‌ చెంతకు పంచాయతీ..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో: నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ చేసిన అసందర్భ ప్రేలాపనతో రాజకీయ రచ్చ మొదలైంది. తను గెలిచిన తరువాత పెట్టిన ప్రెస్‌మీట్‌ కాంగ్రెస్‌ను కవ్వించేలా చేసి ఈ రెండు పార్టీలు రచ్చకెక్కి జుట్టు జుట్టు…

పంతం నీదా నాదా సై..! జిల్లాపై పెత్తనం కోసం అర్వింద్ పాకులాట..!! మాజీ మంత్రిని టార్గెట్‌ చేసిన ఎంపీ.. హోం మినిష్టర్‌ కాబోతున్నాడనే సంకేతాల నేపథ్యంలో వ్యక్తిగతంగా టార్గెట్.. లిక్కర్‌ దందా, స్వలాభం తప్ప నాయకుడి లక్షణాలు లేవంటూ వెటకారాలు.. జిల్లాకు తన వల్ల ఒరిగిందేమీ లేదంటూ వ్యంగ్యాస్త్రాలు.. ఓటుకు 200 పంచాడంటూ తీవ్ర ఆరోపణలు.

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో: ఇలా గెలిచాడో లేదో జిల్లాపై తన పెత్తనం కోసం పాకులాటలు మొదలుపెట్టాడు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం, మంత్రి వర్గ విస్తరణలో జిల్లాకు చెందిన సీనియర్‌ లీడర్‌ సుదర్శన్‌రెడ్డికి కీలకమైన హోం మినిష్టర్‌ ఇస్తారనే…

You missed