ఆ కాంట్రాక్టర్‌ బిల్లులు రాక చనిపోలేదు…

అది తప్పుడు వార్త… ఖండించిన విద్యాశాఖ..

మన ఊరు- మన బడి పనులు చేసి బిల్లులు రాక ఎస్ఎంసీ చైర్మన్‌ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం..

మన ఊరి మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది. కోట్ల రూపాయలతో మరమ్మతులు, తరగతి అదనపు గదులు, ప్రహారీ గోడల నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణం తదితర పనులకు టెండర్లను ఆహ్వానించింది. ౩౦ లక్షల రూపాయలలోపు స్కూల్‌ మేనేజ్‌మెంట్ కమిటీ వారే నామినేషన్‌ ద్వారా పనులు చేసుకోవచ్చని ఆదేశించింది. ఆపై మొత్తం ఉన్న పనులను టెండర్ల ద్వారా కేటాయించింది. కానీ టెండర్లు ఎన్ని సార్లు పిలిచినా ఎవరి నుంచి స్పందన లేదు.

ఐదారు సార్లు టెండర్లు కాల్ ఫర్‌ చేసినా ఎవరూ రాలేదు. కానీ ౩౦ లక్షల లోపు ఉన్న పనులను ఎస్‌ఎంసీ చైర్మన్లుగా ఉన్నవారు చేసుకున్నారు. మాక్లూర్‌ మండలం కల్లెడలో కూడా ఎస్‌ఎంసీ చైర్మన్‌ విజయ్‌ (౩౩) పనులు చేశాడు. కానీ బిల్లులు రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడని ఈ రోజు సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దీన్ని జిల్లా విద్యాశాఖ ఖండించింది. బిల్లుల చెల్లించామని, అవి రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు పూర్తి అవాస్తవమని ఖండించాయి. దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

 

You missed