దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: హరీశ్‌రావు ఎప్పుడు అంతే..! ఏదో ఒకటి చేసి రాజకీయాలను తనవైపు తిప్పుకుంటాడు. బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌.. పూర్తి అధికారాలు ఇవ్వకగానీ… లేకపోతే పార్టీని ఈ రేంజ్‌లో ఊపుకు తెచ్చేవాడే… ఇవీ ఇప్పుడు బీఆరెస్‌ పార్టీ క్యాడర్‌లో నడుస్తున్న చర్చ.

రుణమాఫీ పంద్రాగస్టు నాటికి చేసేస్తా అని సీఎం రేవంత్‌ అన్ని మీటింగులలో ఊదరగొడుతున్న నేపథ్యంలో.. దీన్నే తన రాజకీయ అస్త్రంగా వాడుకున్నాడు హరీశ్‌రావు. ఓ రాజీనామా లేఖను రేవంత్‌పైకి సంధించి అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకున్నాడు. పంద్రాగస్టులోపు నువ్వు రుణమాఫీ చేస్తే ఇగో స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాకు సిద్దం… అంటూ ఏకంగా గన్‌పార్క్‌లోని అమరవీరుల విగ్రహం వద్దకు వెళ్లి అక్కడే రాజీనామాను మీడియాకు సమర్పిచడంతో ఇది మరింత వేడెక్కింది.

రేవంత్ ఏమీ తగ్గలేదు. చేసి తీరుతా.. నీ పీడ విరగడవుతుంది.. అని క్లారిటీ ఇస్తూనే.. నువ్వు రాజీనామాకు ఆమోదం పొందేలా ఆ లేఖను సమర్పించేదని, తప్పుదోవ పట్టిస్తున్నావని కూడా కామెంట్‌ చేశాడు. ఇలా రాజకీయాలు నడుస్తుండగా.. ఈ అంశం జనాల్లో కాకుండా బీఆరెస్‌లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఏదో ఒకటి హరీశ్‌ పార్టీకి కొత్త ఊపు తెస్తున్నాడనే భావన నెలకొన్నది.

కేటీఆర్‌ను నమ్ముకుంటే ఇప్పటి దాకా చేసిందేమీలేదని, కమిటీలను కూడా వేయని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మనకు అవసరమా..? అదే హరీశ్‌కు పగ్గాలిస్తే పార్టీకి పూర్వవైభవం వస్తుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు చాలా మంది. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తరువాత రేవంత్‌ సర్కార్‌ను ఎండగట్టాలన్నా… పార్టీ లీడర్, క్యాడర్‌ను కాపాడుకోవాలన్నా హరీశ్‌తోనే సాధ్యమనే డిస్కషన్‌ మొదలైంది. హరీశ్‌ రాజీనామా అంశమే గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రధాన చర్చగా వస్తోంది. కేసీఆర్‌ బస్సుయాత్రకు, కేటీఆర్‌ మీటింగులకు కూడా అంతటి ప్రాధాన్యత లభించకపోవడం గమనించదగ్గ విషయం.

You missed