ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ … పుష్పలోని ఐటెం సాంగ్‌తో వెండితెర కొత్త గొంతుకనందించిన మంగ్లీ (సత్యావతి) చెల్లో ఇంద్రావతి చౌహాన్ .. ఓ కొత్త పాటతో ముందుకొచ్చింది. పాడటమే కాదు.. ఆడి తనూ అక్కకు ఏం తక్కువ కాదని నిరూపించింది. మంచి పాట.. తగినట్టు డ్యాన్సు.. నప్పినట్టు పాట డైరెక్షన్.. అందరికీ నచ్చినట్టు మొత్తానికి ఆ పాట ఆకట్టుకున్నది.
జారు జారు బండ మీద జామురాతిరి ఓ గంధసిరి వనమాలీ..
జోరు జోరు జాజిరాటలాడే పోకిరీ ఓ గంధసిరి వనమాలీ…
పిండారబోసినట్టు.. వెండీ వెన్నళ్ల జల్లూ..
నిండార నిన్ను జూడ వద్దమంటే వాళ్లు వీళ్లూ…
అద్భుతమైన ఓ ప్రేమ పాటను.. అంతే మధురంగా పాడింది ఇంద్రావతి.
వాస్తవానికి ఊ అంటావా మావా పాటలో తన గాత్ర ప్రతిభ ఎక్కువగా ఫోకస్ కాలేదు. ఆ పాటలోని అర్థానికే ఎక్కువ ప్రాచూర్యం లభించింది. కొత్త గొంతుకగా వచ్చిన ఇంద్రావతి చౌహాన్ కు తన ప్రతిభ చూపేందుకు ఇది వందశాతం ఉపయోగపడలేదు.. ఇప్పుడు ఈ పాటతో ఆమె పాటనే కాదు.. ఆటనూ అవలీలగా అందంగా చేయగలిగింది, చెల్లెతో మంగ్లీ కూడా స్టెప్పులేని చేయందించింది.
మంగ్లీ ప్రెసెంటేషన్‌లో విడుదలైన ఈ పాటను రాసింది సదా చంద్ర. బాగున్నాయి బాణీలు.
మ్యూజిక్ మదీన్ ఎస్‌కే, కోరియోగ్రాఫర్ జాను లిరీ.. స్టెప్పులు బాగా కుదిరాయి. ఎంచుకున్న బిల్డింగ్ , లొకేషన్ కూడా పాటకు తగ్గట్టుగానే ఉంది. బాగుంది.. ఆల్ ది బెస్ట్ ఇంద్రావతి…