వలపన్ని ఉచ్చులోకి… విరగడైన వీసీ పీడ..

ఏసీబీకి చిక్కిన టీయూ వీసీ..

లంచం తీసుకుంటూ రెండ్‌ హ్యాండెడ్‌గా దొరికిన వీసీ రవీందర్ గుప్తా….

ఇది ట్రయల్‌ మాత్రమే.. ముందుంది అసలు సినిమా….

తెలంగాణ వర్సిటీ పరువును గంగలో కలిపిన వీసీపై సర్కార్‌ ఉక్కుపాదం……

 

అంతా అనుకున్నట్టే జరిగింది. కాకపోతే కొంత ఆలస్యం. చివరకు అంతా కోరుకున్నదే జరిగింది. ఈసీ సభ్యులు చేసిన తీర్మానాలే ప్రధానంగా తీసుకున్న సర్కార్‌ టీయూ వీసీ రవీందర్‌ గుప్తాపై కొరడా ఝుళిపించింది. ఉక్కుపాదం మోపింది. ఎట్టేకేలకు వీసీ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఇక ఊచలు లెక్కపెట్టనున్నాడు. వర్సిటీ పరువును గంగలో కలిసి…. విద్యార్ధుల భవిష్యత్తును బజారుకీడ్చిన వీసిని అంత మామూలుగా వదిలేలా లేదు సర్కార్‌. ఎమ్మెల్సీ కవిత దీనిపై సీరియస్‌గా సర్కార్‌కు రిపోర్టు ఇచ్చారు.

దీని ఆధారంగా ఇప్పటికే విజిలెన్స్‌, ఏసీబీ దాడులు.. వీసీ పరారు కావడం.. పట్టుకొని పుట్టలోని అక్రమ పాములన్నీ బయటకు తీసి వాటి కోరలు పీకే పని పూర్తి చేసిన అధికారులు.. ఈ రోజు ఈ ఎపిసోడ్‌కు ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చారు. ఏసీబీ ఉచ్చులో మొత్తానికి ఇరికాడు. లంచం తీసుకోవడం పరిపాటే కాబట్టి.. ఈజీగా ఏసీబీ ఉచ్చులో ఈ తిమింగళం పడింది. దీంతో ఒక జైలులో ఊచలు లెక్కపెట్టేందుకు రెడీ అయ్యాడు. అయితే ఇది కేవలం ట్రయల్‌ మాత్రమే అంటున్నారు అధికార వర్గాలు.. అసలు సినిమా ఇంకా ముందుందంటున్నారు. చూడాలి ఏమేం చేస్తారో. వర్సిటీని మొత్తానికి గాడిలో పడేలా తీసుకున్న చర్యలు చకచకా జరిగాయి. త్వరలో యూనవర్సిటీకి పూర్వవైభవం తెచ్చేలా ఇంకెన్ని సంస్కరణలు, కఠిన చర్యలు తీసుకుంటారో చూడాలి.

You missed