న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక విష‌యంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం.. కేటీఆర్‌, క‌విత, సంతోష్ రావుల ప‌ట్టింపు లేని త‌నం… ఆ ప‌త్రిక మ‌నుగ‌డ‌కే గొడ్డ‌లి పెట్టులా మారింది. ఇద్ద‌రు ఎడిట‌ర్ల‌ను మార్చాడు కేసీఆర్‌. కొత్త‌గా ఏరి కోరి కృష్ణ‌మూర్తిని తెచ్చిపెట్టుకున్నారు. ఇక ఈ ప‌త్రిక ప‌రిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి ప‌డ్డ‌ట్ట‌య్యింది.

కోబ్రా కోవ‌ర్డుల‌ను నియ‌మించుకున్న కొత్త ఎడిట‌ర్‌.. వాళ్లు చెప్పిన‌ట్లు చేస్తాడు. ఉద్యోగుల‌ను పీకే పారేస్తాడు. త‌న‌కు కావాల్సిన వారిని తెచ్చిపెట్టుకుంటాడు. ఉద్యోగుల‌కు మూడేండ్లుగా ఇంక్రిమెంట్లు ఉండువు గానీ, త‌నకు కావాల్సిన కొద్ది పాటి మంది ఉద్యోగుల‌కు మాత్రం మూడు సార్లు ఇంక్రిమెంట్లు.. మూడు సార్లు ప్ర‌మోష‌న్లు ఇప్పించుకుంటాడు. అంతా తానై న‌డిపిస్తున్నాన‌ని కేసీఆర్ ద‌గ్గ‌ర ఊద‌ర‌గొట్టుకుంటాడు. కింద స్థాయి ఉద్యోగుల క‌ష్టానికి ఇక్క‌డ గుర్తింపు ఉండ‌దు. ఫ‌లితం ఉండ‌దు. నేనే అంతా.. నాకే అంతా.. అనేది ఆయ‌న పాల‌సీ. ఇలా ఈ ప‌త్రిక నానాటికి దిగ‌దిడుపుగా మారింది. స‌ర్క్క్యూలేష‌న్ ప‌డిపోయింది. అయినా ఎవ‌రూ జోక్యంచేసుకోరు.

ఇంత జ‌రుగుతున్నా కేసీఆర్‌కు ప‌ట్ట‌దు. ఆయ‌న‌కు కావాల్సింది … రోజూ త‌న ఫోటోను పెద్ద సైజలో పేప‌ర్ ఫ‌స్ట్ పేజీలో వేస్తున్నారా లేదా.. అని అంతే. అంత‌కు మించి ఏమీ ప‌ట్ట‌దు పెద్దాయ‌న‌కు. మేనేజ్‌మెంట్ కూడా పూర్తిగా చేతులెత్తేసి ఈయ‌న చెప్పిన‌ట్లే న‌డుచుకుంటుంది. ఇది చాల‌ద‌న్న‌ట్టు.. ఈ మ‌ధ్య కేసీఆర్ కొత్త నిర్ణ‌యం తీసుకోబోతున్నాడ‌ట‌. న‌మ‌స్తేను ముంచిన ఘ‌నుల‌కే టీ న్యూస్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించి దాన్ని కూడా అంతే వేగంగా ప‌త‌నావ‌స్థ‌ను తీసుకురావాల‌ని ఘాఠ్టిగా కంక‌ణం క‌ట్టుకున్నాడ‌ట‌.

ఇప్ప‌టికే టీ న్యూస్ ప‌రిస్థితి అంతంత మాత్రం. ఇక న‌మ‌స్తే ను ఆగం చేసి అంగ‌ట్లో పెట్టిన టీమే దీంట్లోకి చొర‌బ‌డి త‌మ పెత్త‌నం చాటుకుని, ఆధిప‌త్యం పాతుకునేలా చేసి.. అంతా త‌మ వారిని నింపి.. ఆ త‌ర్వాత దీన్ని తెలంగాణ‌లోనే నెంబ‌ర్ వ‌న్ చాన‌ల్ చేస్తార‌ని కేసీఆర్ భావిస్తున్నాడ‌ట‌. వేరీ గుడ్… మంచి ప‌రిణామం. కానివ్వండి..

You missed