ఆర్టీసీలో సమ్మె సైరన్…! అసలక్కడ ఏం జరుగుతోంది..? పాలకులు మారినా విధానాలు మారవా..? పేరుకే ప్రభుత్వరంగం… కార్మికులకు తప్పని వెట్టిచాకిరి… ప్రాణంతోడే పనిభారాలు…! సగానికి పైగా అద్దెబస్సులు… ఎలక్ట్రిక్ బస్సులే…! కనీసవేతనాలు కరువు…! కార్మికులు దాచుకున్న సొమ్ము యాజమాన్యం మింగేసిన వైనం..! దుర్భర పరిస్థితుల్లో ఆర్టీసి కార్మికుల జీవితాలు…!!
తెలంగాణ ఏర్పాటు నుండి నేటి వరకు సుమారు 14, 000 మంది ఆర్టీసి కార్మికులు రిటైర్ అయినా ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క కొత్త ఉద్యోగం ఇయ్యలేదు సరికదా ఉన్న ఉద్యోగులపైన విపరీతమైన పనిభారం పెంచి వారి ఆరోగ్యాలతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నది…