కేంద్రం పెట్రోల్, డీజీల్‌పై ఎంత త‌గ్గించుకుంటే మాకేందీ..? కొండంత పెంచారు.. పిస‌రంత త‌గ్గించారు. అసలు మేము వ్యాట్ పెంచామా? ఎందుకు తగ్గించాలి. ఇదీ మ‌న స‌ర్కార ద‌బాయింపు. కేంద్రం త‌గ్గించిన త‌ర్వాత వివ‌ధ రాష్ట్రాలు త‌గ్గించాయి.. మ‌రి మీరు త‌గ్గించ‌రా..? అని తెలంగాణ స‌ర్కార్‌ను నిల‌దీశాయి బీజేపీ శ‌క్తులు. ప్ర‌జ‌లు. కానీ కేసీఆర్ విన‌లేదు. త‌గ్గేదే లే.. అని న‌యాపైస కూడా పెట్రోల్, డీజీల్‌పై త‌గ్గించ‌లేదు. అస‌లు మ‌న స‌ర్కారుకు ఆదాయం వ‌చ్చేదే.. మందు, ఇంధ‌నంపై మ‌రి వాటిని ఎలా తగ్గిస్తాడు.

క‌రోనా మొద‌టి వేవ్ స‌మ‌యంలోనే చేసేందుకు ప‌నులు లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్న స‌మ‌యంలోనే మందు రేట్లు ఆమాంతం పెంచేశాడు కేసీఆర్‌. సేమ్ మోడీ స‌ర్కార్ ఆలోచ‌న‌లాగే. రేటు పెంచితే వాడ‌కం త‌గ్గుంద‌నేది వీరి స‌మ‌ర్థింపు వ‌డ్డింపు వాదన‌. కానీ ఆ ముసుగులో పీల్చి పిప్పి చేసి వ‌సూలు చేసి ఆదాయాన్ని స‌మ‌కూర్చుకోవ‌డ‌మే అస‌లు ఉద్ధేశ్యం. ఇది అంద‌రికీ తెలిసిందే. అటు మద్యం మీద పెంచిన రేట్లు, ఇటు పెట్రోల్, డీజీల్ మీద వ‌చ్చే ఆదాయం.. ఇవే ఇప్పుడు సంక్షేమ ప‌థ‌కాలు న‌డ‌వ‌డానికి వ‌న‌రులు. క‌రువు కాలంలో కూడా ఏవేవో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టి.. ఇలా ప్ర‌జ‌ల మీద ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా భారం మోప‌డం పాల‌కుల‌కు అలవాటే. అందులో కేసీఆర్ పాల‌న కూడా ఏం భిన్నం కాదు.

ద‌ళిత‌బంధుకు కోట్ల రూపాయ‌లు ఎక్క‌డ్నుంచి రావాలె. ప్ర‌జ‌ల‌ను పీల్చి పిప్పి చేయాలె. పింఛ‌న్ల‌కు నెల నెలా ఇచ్చేందుకు పైస‌లే లేవు. కొత్త వాటికి దిక్కేలేదు ఏళ్ల త‌ర‌బ‌డి. కానీ ఇంకా ఉచిత ప‌థ‌కాలు మాత్రం పుట్టుకొస్తూనే ఉంటాయి. బ‌డ్జెట్‌తో సంబంధం లేకుండా. ఇలా ప్ర‌జ‌ల మీదే ప‌డి స‌ర్కారు సంపాదించుకోవాలె. ఈసారి ఇంకా వైన్ షాపులు ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెంచేసింది. అధికారికంగా ఆదాయం పెంచుకునేందుకు.

అదేందీ.. అధికారికంగా ఆదాయం పెంచుకోవ‌డ‌మేందీ..? అవును.. ప్ర‌తీ ఊర్లో ఏ బెల్ట్ షాపు ఉంటుంది. అది వీడీసీ పెద్ద‌ల స‌హ‌కారంతో సాగుతుంది. ఎక్సైజ్ అధికారుల అండ‌దండ‌ల‌తో ఉంటాయి. దీనికి టైమ్ ఉండ‌దు. 24గంట‌ల‌కు ఎక్కువ రేటుకు మ‌ద్యం దొర‌కుతుంది. మ‌రి ఇలా దొంగ‌త‌నంగా అమ్ముకుని సొమ్ముచేసుకుని స‌ర్కార్ బ‌ద్నాం కావ‌డం కంటే.. అధికారికంగా మ‌ద్యం దుకాణాలు పెంచి సొమ్ము చేసుకోవ‌డం బెట‌ర్ క‌దా. ఎంత రేటు పెంచినా మందు తాగ‌డం ఆగుతుందా..? పెట్రోల్ రేటు పెరిగింద‌ని బండ్లు, కార్లు న‌డ‌పడం మానుతారా? మ‌రి దీని గురించి స‌ర్కార్ ఎందుకు సీరియ‌స్‌గా ఆలోచించాలె. ఎవ‌రి చావు వాళ్ల చ‌స్తారు. ఇలా అవ‌కాశం ఉన్న వాళ్లు ప‌క్క‌రాష్ట్రం వెళ్లి తెచ్చుకుంటారు.

అవునూ….. మందు కూడా ప‌క్క రాష్ట్రాల్లో త‌క్కువ‌గా ఉందా..? మ‌రి ఒకేసారి టోకున కాట‌న్‌ల‌కు కాట‌న్‌లు తెచ్చి పెట్టుకుంటే.. అయినా అంత పెద్ద మొత్తంలో తెచ్చిపెట్టుకునేందుకు మ‌న ద‌గ్గ‌ర అన్ని పైస‌లుండాలి క‌దా. పెట్రోల్‌, డీజీల్ తోనైతే బ‌తుకు బండి న‌డ‌స్తుంది. ఈ మందుతో ఏం న‌డుస్తుంది బ‌తుకు బొక్క‌బోర్లా ప‌డ‌టం త‌ప్ప‌

You missed