దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

నిజామాబాద్‌ లోక్‌సభ సీటును కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌ బాగానే తంటాలు పడింది. అధిష్టానమూ ఆశలు పెట్టుకుంది. కానీ ఇక్కడి లీడర్‌ షిప్‌ వైఫల్యం ఘోరంగా ఆ పార్టీని పరాభవం చేసేలా చేసింది. వాస్తవానికి ఎంపీ అర్వింద్‌పై ప్రజల్లో, అన్ని వర్గాల్లో విపరీతమైన వ్యతిరేకత, అసంతృప్తి ఉంది. దీన్ని కాంగ్రెస్‌ తనకు అనుకూలంగా మలుచుకోవాలి. కానీ అది జరగలేదు. అభ్యర్థి ఎంపికలోనే రాంగ్‌ స్టెప్‌ వేసింది. జీవన్‌రెడ్డి ఇక్కడి వాడు కాదు. నాన్‌ లోకల్ ముద్రవేశారు. ఎన్నికలకు చివరి రోజుల వరకు డబ్బుల తీయలేదు. జీవన్‌రెడ్డి పైసలు లేవని చేతులెత్తేశాడు.

మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి మీద అధిష్టానం భారం మోపింది. ఆశలు పెట్టుకున్నది.కాబోయే మంత్రి, జిల్లాకు పెద్ద దిక్కు కదా .. గెలిపించుకుంటాడని భావించి ఉంటుంది. కానీ సుదర్శన్‌రెడ్డి ఎంగిలి చేత్తే కాకిని కూడా విదిలించే రకం కాదు. అంతటి పీనాసి. నా ఎలెక్షన్‌కే పైసలు తీయలేదు. మీకెందుకిస్తాను అనే విధంగా ఆయన ప్రవర్తన పార్టీ క్యాడర్‌ను ఇబ్బంది పెట్టింది. జీవన్‌రెడ్డి మేదావి వర్గంగా ముద్రవేసుకునే ప్రయత్నం చేసినా ఇందూరు జనం యాక్సెప్ట్‌ చేయలేదు. ఇది అర్వింద్‌కు బాగా కలిసి వచ్చింది. దీనికి తోడు మోడీ మానియా ఉండనే ఉంది. మాజీ మంత్రి తన బోధన్‌ నియోజకవర్గానికే పరిమితమై పనిచేయగా.. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్‌ అర్బన్‌కే పరిమితమయ్యాడు.

ఇద్దరు పెద్ద లీడర్లు కనీసం పార్టీని గెలుపు తీరాలకు తీసుకుపోయే బరువు భాధ్యతలు మోయలేదు. బాల్కొండ, ఆర్మూర్‌ ఇద్దరూ తమ వద్ద పైసలు లేవని మొదటి నుంచీ మొత్తుకుంటున్నారు. దీంతో వీరు కూడా తమకొచ్చిన బాధేంటని పరిమితంగానే పనిచేశారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తన అహంకారంతో అందరినీ దూరం చేసుకున్నాడు. ఇక్కడ చాలా మైనస్ కాంగ్రెస్‌కు. జగిత్యాల, కోరుట్లపై జీవన్‌రెడ్డి దృష్టి పెట్టినా అక్కడ కూడా నేను పైసలు పంచను..అనే నినాదంతో ముందుకు పోయాడు.. ఎమ్మెల్యే ఎన్నిక రిజల్టే ఇక్కడా రాకమానదు.

దీంతో ఇందూరు లోక్‌సభ సీటును తమ ఖాతాలో వేసుకుంటామని ధీమాగా ఉన్న కాంగ్రెస్‌ అధిష్టానానికి మాజీ మంత్రి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లు పెద్ద షాక్‌నే ఇవ్వనున్నారు. కొసమెరుపేమిటంటే.. ఇవాళ వీరు నిజామాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టారు. లక్ష మెజారిటీ అన్నారు. తిరకాసు మెలికొకటి పెట్టారు. బీఆరెస్‌ క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిందని. బీఆరెస్‌ క్యాడర్‌ బీజేపీకి సపోర్ట్ చేసిందని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెప్పాడు. అంటే రేపు పరాభవం మూటగట్టుకుంటే వీరే ప్రెస్‌మీట్‌ పెట్టి బీజేపీకి బీఆరెస్‌ పనిచేసింది కాబట్టే ఓడిపోయామని కలరింగ్‌, కవరింగ్‌ ఇచ్చుకుంటారన్న మాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed