వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్‌:

ఖమ్మం లోక్‌సభ బరి నుంచి సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావును దాదాపుగా అధిష్టానం ఫైనల్‌ చేసింది. ఇక సామాజిక కోణంలో లోతైన అధ్యయనం చేసిన రేవంత్‌.. మండవ అయితేనే గెలిచే అవకాశం ఉందని డిసైడ్ చేశాడు. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.

కాగా జిల్లాలో ఆయన సేవలను ఏమాత్రం కాంగ్రెస్‌ ఆశించడం లేదు. ఆయన జిల్లా రాజకీయాల నుంచి .. ప్రత్యేకంగా రూరల్ నియోజకవర్గ రాజకీయాల నుంచి దూరమైపోతేనే బాగుంటుందని రూరల్‌ ఎమ్మెల్యే రేకుల పల్లి భూపతిరెడ్డి భావిస్తున్నాడు. అందుకే రేవంత్ నిర్ణయంతో సంపూర్ణ అంగీకారం తెలిపాడు భూపతి. మొత్తానికి జిల్లా రాజకీయాల నుంచి మండవను తరమేసూ ప్రయత్నం జరుగుతోంది. ఖమ్మం లోక్‌సభ సీటు ఆయనకు వరిస్తే భలే భలే బాగు బాగు అని చంకలు గుద్దుకునేందుకు రెడీగా ఉన్నారు రూరల్యేతోపాటు జిల్లా కాంగ్రెస్ నేతలు.

You missed