Month: January 2024

అధ్యక్షుడెవరు..?..? అనాథ చేసిందెవరు..? ఇంకా మారరా..? ఇట్లయితే కష్టమే రామన్నా..! గతం ఘనం… ప్రస్తుతం అధ్వానం.. గణతంత్ర వేడుకలకు అంతా దూరం.. బీఆరెస్‌లో ఎవరికి వారే.. మేయర్‌తో జెండా ఆవిష్కరణ.. హాజరుకాని సీనియర్‌ నాయకులు… వెలవెలబోయిన బీఆరెస్‌ పార్టీ కార్యాలయం…

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: రామన్న.. ఇంకా మారలేదు. పార్టీని మార్చే పనినీ ఇంకా భుజానికెత్తుకోలేదు. అధికారం ఉన్నప్పుడూ పట్టించుకోలేదు. ఇప్పుడూ పట్టించుకోవడం లేదు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హడావుడిగా మీటింగులు పెట్టి జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్న…

అర్వింద్‌ రాజకీయానికి ‘బస్వా’ బలి…. జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించిన ఎంపీ… ఏ పదవీ ఇవ్వకుండా ఖాళీగా వదిలేసిన వైనం.. పార్టీ విడిచిపోవాలని పరోక్ష సంకేతం… ఎమ్మెల్యే, ఎంపీ సీటు ఆశించడం పాపం.. ఢిల్లీ పెద్దలతో సబంధాలు నెరపడం పై అర్వింద్‌ గుస్సా.. తన గుప్పిట్లోనే పార్టీ ఉండేలా ఎత్తులు.. అసమ్మతి నేతల రాజకీయంతో ఆటలు..

దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి: నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ రాజకీయానికి బడుగు నేత, పద్మశాలి కులానికి చెందిన బస్వా లక్ష్మీనర్సయ్య బలయ్యాడు. ఇన్నేళ్ల అతని రాజకీయ భవిష్యత్తును కాలరాశాడు అర్వింద్‌. దీనికి కారణం పార్టీలో అర్వింద్‌కు ఎదురుతిరగడమే. అసమ్మతిగా పనిచేయడమే. ఎమ్మెల్యే,…

‘గులాబీ’తో అంటకాగిన ఫలితం… ఉద్యోగ సంఘ నేతల ‘రాజకీయాల’కు రేవంత్‌ సర్కార్‌ చెక్‌.. కమిటీలు రద్దు.. కొత్తగా మెంబర్‌షిప్స్‌.. ఎన్నికలు.. పదేళ్లుగా ఏకచత్రాధిపత్యం వహించిన ఫైరవీకారుల నేతలకు కాలం చెల్లు.. నెలరోజుల్లో కొత్త కమిటీలు.. ఉద్యోగ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: ఉద్యోగ సంఘం నేతల ముసుగులో పదేళ్లు వారిదే రాజ్యం నడిచింది. ఉద్యోగ సంఘం నేతల్లా కాకుండా వారో రాజకీయ నాయకుల్లా చెలామణి అయ్యారు ఈ పదేళ్లు. గులాబీ నేతలను ప్రసన్నం చేసుకుని కావాల్సిన ఫైరవీలు చేసుకున్నారు.…

వెంటాడిన దురదృష్టం.. వరుస ఓటమిలతో ‘ సలహాదారు’తో సరి..! షబ్బీర్‌కు ప్రభుత్వ సలహాదారు పదవి.. గెలిస్తే.. మంత్రిగా.. కీలక హోదాలో ఉండేవాడు.. చర్చించుంకుంటున్న పార్టీల నేతలు..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: కాలం కలిసి వచ్చింది. కాంగ్రెస్‌ అధికారం చేపట్టింది. కానీ వరుస ఓటమితో కుంగిపోయిన షబ్బీర్‌ను మాత్రం కాలం కనికరించలేదు. ఈ సీనియర్‌ మైనార్టీ నేతను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. కామారెడ్డి నుంచి తప్పుకుని నిజామాబాద్‌ అర్బన్‌…

అలక పాన్పెక్కిన ‘పల్లె’ … జిల్లా అధ్యక్ష పదవి, కిసాన్ మోర్చాకు నో చెప్పేసిన గంగారెడ్డి.. పార్టీ పదవులేనా.. ? నా సీనియారిటీ, త్యాగాన్ని ఎప్పుడు గుర్తిస్తారు.. ?? అధిష్టానం, అర్వింద్‌ తీరుపై పల్లె గంగారెడ్డి గుర్రు.. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ పల్లె… నామినేటెడ్‌ పదవీ దక్కకపోవడంపై నైరాశ్యం.. పార్టీ కార్యక్రమాలకూ దూరం దూరం.. పెద్దల ఫోన్లూ ఎత్తని వైనం..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: బీజేపీ సీనియర్‌ లీడర్‌, రాష్ట్ర పార్టీ కార్యదర్శి పల్లె గంగారెడ్డి అధిష్టానం తీరు, ఇక్కడ ఎంపీ అర్వింద్‌ వైఖరిపై గుర్రుగా ఉన్నాడు. కొద్ది రోజులుగా ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఎవరి ఫోన్లకు సకాలంలో…

పనుల ప్రారంభోత్సవాలు…. చెయ్యాలి మళ్లీ మళ్లీ.. ఎన్నికల ముందు ప్రారంభమైన పనుల శిలాఫలాకలను కూల్చేసిన రూరల్‌ కాంగ్రెస్‌ నేతలు.. వీటికే మళ్లీ కొత్త శిలాఫలకాలు.. కొత్త ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేరు.. నేడు రెండోసారి అభివృద్ధి పనుల ఓపెనింగ్‌లు.. ఫౌండేషన్‌ స్టోన్లు.. రూరల్ నియోజకవర్గంలో భూపతిరెడ్డి మార్క్ రాజకీయం.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాజిరెడ్డి గోవర్దన్‌…

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌. టెండర్లు పూర్తి చేసి .. అగ్రిమెంట్లు చేసుకుని .. ప్రొటోకాల్‌ ప్రకారం శిలాఫలకాల ఏర్పాటు చేసి పనులు ప్రారంభించేశారు. అవి…

నిజామాబాద్‌ ఎంపీ బరిలో నరేందర్‌రెడ్డి..? బీఆరెస్‌ పరిశీలనలో ప్రముఖ వ్యాపారవేత్త పేరు.. రెడ్డి సామాజికవర్గానికి టికెట్ కేటాయించాలనే డిమాండ్‌ వెనుక సమీకరణలు.. కాంగ్రెస్‌ జీవన్‌రెడ్డికి టికెట్‌ ఇస్తే.. అందుకు బలమైన ప్రత్యర్థి కోసం వెతుకులాట.. కాంగ్రెస్సే తమకు పోటీ అనుకుంటున్న బీఆరెస్‌… ఈ దిశగా అధిష్టానం సమాలోచనలు..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న ఇందూరు.. ఇప్పుడు మళ్లీ వార్తల్లో కేంద్రబిందువవుతోంది. నిజామాబాద్‌ ఎంపీ బరిలో ఎవరు నిలుస్తారనే చర్చ గత కొద్ది రోజులుగా ఉత్కంఠభరిత…

మంత్రికి రాకేశ్‌రెడ్డి వార్నింగ్‌..! కంట్రోల్‌లో పెట్టకపోతే… చూస్కుందాం…!! వినయ్‌రెడ్డి దాష్టీకాలు ఆపండి… మంత్రికి వార్నింగ్‌ ఇచ్చిన ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి.. ఆర్మూర్‌ లో మూడు పార్టీల మధ్య రచ్చ రాజకీయం…

దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి: ఆర్మూర్‌ రచ్చ రాజకీయం రాష్ట్ర వ్యాప్తం చర్చై కూర్చుంది. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పరిణామాలు ఒక్కసారిగా మారాయి. తన ప్రచారంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిని మాటలతో…

You missed