దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

రామన్న.. ఇంకా మారలేదు. పార్టీని మార్చే పనినీ ఇంకా భుజానికెత్తుకోలేదు. అధికారం ఉన్నప్పుడూ పట్టించుకోలేదు. ఇప్పుడూ పట్టించుకోవడం లేదు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హడావుడిగా మీటింగులు పెట్టి జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. జిల్లాల అధ్యక్షులను మాత్రం మార్చలేదు. నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడెవరో తెలియదు. ఎందుకంటే గణతంత్ర వేడుకకు జిల్లాలో పార్టీ సీనియర్లెవరూ హాజరుకాలేదు. జీవన్‌రెడ్డి ఇటు వైపు రాలేదు. మాటలేదు ముచ్చటలేదు. ఓడిన ఎమ్మెల్యేలూ పార్టీ ముఖం చూడలేదు. బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తన నియోజకవర్గానికే పరిమితమయ్యాడు. ఇటువైపు రాలేదు.

కొత్త ఊపు తెస్తానని,మనమేం తక్కువ కాదని, మనదే మళ్లీప్రభుత్వమని, త్వరలోనే కేసీఆర్‌ను సీఎం చేద్దామని రోజుకో మాట మాట్లాడుతూ వస్తున్న పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తను కమిటీలు వేయకుండా కాలయాపన చేస్తూ భ్రష్టుపట్టించిన జిల్లాలను చక్కదిద్దే పనిని మాత్రం చేయడం లేదు. జిల్లాలో మొన్నటి వరకు బీఆరెస్‌కు రాజకీయంగా జిల్లా కంచుకోట. కానీ నాయకుల తీరు, కేటీఆర్‌ పట్టింపులేని తనం, కవిత కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో పార్టీ పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. కవిత ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసే పరిస్థితి లేదు. అందుకే ఆమె కూడా ఇటు వైపు రావడం లేదు. కనీసం నేతలతో మాట్లాడటం లేదు. దీంతో జిల్లా బీఆరెస్‌లో అగమ్యగోచరం, అయోమయం నెలకొన్నాయి.

You missed

అర్వింద్‌ ‘పసుపు’ రాజకీయం.. మళ్లీ తెరపైకి బాండుపేపర్.. రెండేండ్లలో టన్నుకు 20వేలు ఇస్తానని ప్రకటన… మళ్లీ అవే ‘బాండ్‌’ అబద్దాలతో ఎంపీ రైతుల చెవిల్లో పసుపు… ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. ప్రస్తుతం పసుపు క్వింటాళ్‌కు 14వేల పై చిలుకు ధర పలుకుతున్న వైనం.. ఎందుకు ఇంత రేటు పెరిగిందో తెలియని నేతల అవగాహనారాహిత్యం.. 70వేల ఎకరాల నుంచి సాగు విస్తీర్ణం సగానికి పడిపోయిన వైనం.. పెరిగిన ఎగుమతి డిమాండ్.. చాలా మంది రైతులు పసుపు పండిచేందుకు వెనుకడుగు.. దీనికి ఎవరు కారణం.. ? పసుపుబోర్డు తెస్తానని ఐదేండ్లు కాలయాపన చేసి ఫలితంగా పసుపు ‘సాగు’ బంగారమయిన దుస్థితి.. రేవంత్‌ కూడా బీజేపీకి మైలేజీ ఇచ్చేలా అవగాహనారాహిత్యపు ట్వీట్‌… మళ్లీ బాండ్‌ పేపర్‌ రాస్తానని బరితెగించిన చెప్పిన అర్వింద్.. కానీ బీఆరెస్‌, కాంగ్రెస్‌ నేతల్లో చలనం లేని రాజకీయ నిస్తేజం.. ‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌….