దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

కాలం కలిసి వచ్చింది. కాంగ్రెస్‌ అధికారం చేపట్టింది. కానీ వరుస ఓటమితో కుంగిపోయిన షబ్బీర్‌ను మాత్రం కాలం కనికరించలేదు. ఈ సీనియర్‌ మైనార్టీ నేతను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. కామారెడ్డి నుంచి తప్పుకుని నిజామాబాద్‌ అర్బన్‌ వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా.. ఆయనను దురదృష్టం వీడలేదు. ఓడిన నేతలకు ఎమ్మెల్సీ, మంత్రి పదవులు ఇచ్చేది లేదని అధిష్టానం నిర్ణయం తీసుకోవడం కూడా షబ్బీర్‌కు శాపంలా మారింది. వరసుగా ఓటమి పాలవుతూ వచ్చిన షబ్బీర్‌ ఇక ఈసారి గెలిచి మంత్రి పదవి అలంకరించి ఇక రాజకీయాలను వైదొలాగాలనే యోచనలో ఉన్నాడు.

కానీ రాజకీయ జీవిత చరమాంకంలో కూడా ఆయనకు అదృష్టం వరించలేదు. ఒకవేళ ఆయనే గెలిచి వుంటే.. మంత్రిగా మంచి ఫోర్ట్‌ఫోలియో తీసుకుని ఉండేవాడు. ఉన్నది ఒక్కరే మైనార్టీ నేత. అందులోనూ సీనియర్‌ మోస్ట్‌. ఇక తిరుగేలేని విధంగా రాజకీయాల్లో హైపర్‌ టెంపర్‌ చూపించి ఉండేవాడు. కానీ బ్యాడ్‌లక్‌. ఇలా ప్రభుత్వ సలహాదారు పదవితో సరిపెట్టుకున్నాడు. అదీ కేబినెట్ హోదా కాదు. డిప్యూటీ మినిస్టర్‌ హోదా. అంతే. ఆరువేలు లాంటిదన్నమాట. ఏం చేస్తాం..? ఎంతోకొంత బెటర్‌ కదా.. అని సరిపెట్టుకుంటున్నారట ఆయన అనుచరగణం.. ఒకవేళ ఆయన మంత్రిగా ఉంటే అటు కామారెడ్డి జిల్లాకు, ఇటు నిజామాబాద్‌ జిల్లాకు అధిక నిధులు వచ్చేవనే టాక్‌ కూడా నడుస్తోంది.

You missed