లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులిచ్చిన నేపథ్యంలో కవిత దీనిపై ఘాటుగా స్పందించారు. నిజామాబాద్‌లోని ఆమె క్యాంపు కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ ఇష్యూపై స్పందించారు. ఈడీ ఈ కేసులో నోటీసులివ్వడాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదన్న ఆమె.. ఏడాదిగా నడుస్తున్న సీరియస్ ఎపిసోడ్‌గా దీన్ని అభివర్ణించారు. నోటీసులు తనకు అందాయాని ఒప్పుకున్న ఆమె.. ఈ నోటీసుల అంశాన్ని తన లీగల్‌ టీమ్‌ చూసుకుంటుందని, రేపు ఈడీ ముందు హాజరుకావాలా అనే విషయాన్ని లీగల్‌ టీమ్‌తో చర్చించిన తరువాత ఆలోచిస్తానని ఆమె అన్నారు.

లిక్కర్‌ స్కాం, ఈడీ నోటీసులు బీజేపీ ఎన్నికల స్టంట్‌ అని కవిత కొట్టి పాడేశారు. ‘దీన్ని మేమెప్పుడో లైట్‌గా తీసుకున్నాం..ప్రజలూ లైట్‌ తీసుకున్నారు.. నాయకులు, కార్యకర్తలు ఎవరూ టెన్షన్‌ పడాల్సిన పనిలేదు…’ అని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీకి బీ టీమ్‌ అని కాంగ్రెస్‌, కాంగ్రెస్‌కు బీ టీమ్‌ అని బీజేపీ అంటున్నారనే ప్రశ్నకు… ‘ మేమెవ్వరికీ బీ టీమ్‌ కాదు.. ప్రజలకు మేం ‘ఏ’టీమ్‌.. అంతే..! ఎవరి నోటికొచ్చినట్టు వారు మాట్లాడతారు.. మేమేంటో తెలంగాణ ప్రజలకు తెలుసు.. ఎన్నికలు రాగానే ఇలాంటి గేమ్స్‌, డ్రామాలు ఆటడం బీజేపికి ఇది కొత్త కాదు.. అది అందరికీ తెలిసిన విషయమే’ అని ఆమె సమాధానమిచ్చారు. కాగా దీనిపై ఇటు కాంగ్రెస్‌, అటు బీజేపీలు కవితపై విరుచుకుపడ్డాయి.

బుధవారం జగిత్యాలలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె కాంగ్రెస్‌పై ఫైర్‌ కావడంతో పాటు రాహుల్‌ను ఔట్‌ డేటెడ్ లీడర్‌గా అభివర్ణించిన విషయాన్ని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ప్రస్తావిస్తూ…. ‘లిక్కర్‌ స్కాం చేసేంత అప్‌డేట్‌ రాహుల్‌ కాలేదని, కవిత లిక్కర్‌ స్కాంలో పీకల్లోతూ కూరుకుపోయారం’టూ కామెంట్‌ చేశాడు. దీనిపై ఎంపీ అర్వింద్ కూడా ట్విట్టర్‌ వేదికగా స్పందించాడు. ఈడీ నోటీసులు జారీ చేయడాన్ని ప్రస్తావిస్తూ ఇదే తెలంగాణ ప్రజలకు అసలైన విమోచన దినం అంటూ వ్యంగ్యంగా పోస్ట్‌ చేయడం చర్చనీయాంశమైంది.

You missed