బీజేపీ గ్రాఫ్‌ ఘోరంగా పడిపోయింది. ఇది ఏ బీజేపీ కార్యకర్త, నాయకులను అడిగినా వాళ్లే చెప్తరు. ఎందుకు..? దీనికి సవాలక్ష కారణాలున్నాయి. అందులో కర్ణాటక ఫలితాలు, కవిత అరెస్టు అంశం, బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తొలగించడం.. ఇంకా ఇంకా… ఒకప్పుడు నాక్కావాలంటే నాక్కాలని పోటీలు పడ్డరు టికెట్ల కోసం. ఇప్పుడంత సీన్‌ లేదు. బీఆరెస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ వచ్చి కూసుంది. బీఆరెస్‌ నాయకులు కూడా బీజేపీని తిట్టడం మాని కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. విమర్శిస్తున్నారు. మ్యానిఫెస్టోలపై విరుచుకుపడుతున్నారు. దీంతో బీజేపీ జమిలి అంటూ బీఆరెస్‌ స్పీడ్‌కు బ్రేకులు వేసే పని చేస్తున్నది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ గురువారం ఎమ్మెల్సీ కవితకు మళ్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ నోటీసులిచ్చింది. ఆ మరుసటి రోజే హాజరుకావాలని కూడా పేర్కొన్కది. దీనిని కవిత లైట్‌గా తీసుకున్నారు. ఇది మోడీ నోటీసని అభివర్ణించారు. ఎన్నికల స్టంట్‌గా కొట్టిపారేశారు. టీవీ సీరియల్‌గా సాగదీస్తున్నారంటు ధ్వజమెత్తారు. అయితే కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారామె. ఎవరూ ఏమీ ఆందోళన చెందొద్దనే సందేశం ఇచ్చారు. ఇదంతా ఒకెత్తయితే ఓ కార్యకర్త సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈడీ నోటీసులు కవిత విచారణ కోసం కాదు… ఆ పార్టీ మనుగడ కోసం, నాయకుల సంతృప్తి కోసం.. అంటూ పుట్టుపూర్వోత్తరాలన్నీ బయటపెట్టాడు. ఇప్పుడు ఈ వార్త వైరల్ అయ్యింది. అదేందో మీరు చదవండి..!

ప్రియమైన కార్యకర్తలారా !

విచారణ పేరుతో గత యాడాది కాలంగా మన అక్క గారికి నోటీసులు ఇచ్చికుంటూ వెళుతున్న తీరును మీరు గమనిస్తనే ఉన్నరు ! ఎం ఎల్ ఎ ల కొనుగోలు వ్యవహారం లో సిఐడి నోటీసులకు బయపడి అజ్ఞాతం లోకి వెళ్లిన పురుషులను మనం చూసినం ! ఎన్ని సార్లు నోటీసు ఇచ్చినా అన్ని సార్లు హాజరై విచారణకు సహకరించి చట్టం మీద తన గౌరవాన్ని చాటుకున్నరు మన నాయకురాలు ! మరో సారి నోటీసు ఇచ్చిన దరిమిలా అక్కతో కలసి నడచిన ఓ పాత కార్యకర్తగా ఓ పాత జ్ఞాపకం ను ఈ లేఖ ద్వారా మల్లోసారి మీతో నెమరు వేసుకుంటున్న ! జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన గిరిజన వీరుడు కొమురం భీం విగ్రహాన్ని మంథని ప్రాంతం లోని మహాముత్తారం మండలం యామన్ పల్లిలో ఆవిష్కరించాలని మన అక్క తలపోసింది! అందుకు కొమురంభీం మనుమడు సోనే రావు ను అక్కడికి రప్పించింది! ఆయనతో విగ్రహ ఆవిష్కరణకు బయలుదేరిన అక్క ను కాటరం లో అరెస్టు చేసిండ్రు!

యామన్ పల్లిలో ఉన్న విగ్రహాన్ని సైతం తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లో బందించిండ్రు! అంతకు ముందు రోజు రాత్రి మహదేవ్ పూర్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్క ఆవిష్కరించింది! ఆ కార్యక్రమానికి నిర్భందాలను దాటుకొని అశేషంగా జనం తరలి వచ్చిండ్రు ! ఇదే పరిస్థితి తెల్లారితే ఉంటదని ఊహించిన అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆమెకు కనీసం అక్కడ బస చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు! దాంతో ఆ రోజు రాత్రి కాళేశ్వరానికి చేరుకున్న అక్క అక్కడి దేవస్థానం అథిది గృహం లో విడిది చేసింది! ఉద్యమ నాయకుడి కూతురు అయినప్పటికి రక్షణ కల్పించాలనే కనీస ధర్మాన్ని కూడా అప్పటి ప్రభుత్వం పాటించలేదు! తెల్లారి అక్క అరెస్టుతో ఆందోళనలు మిన్నంటాయి! ఈ పరిణామ క్రమం లోనే 9 వ తరగతి సాఘీక శాస్త్రం లో కొమురంభీం పాఠ్యాంశంగా వచ్చింది! 7 వ తరగతిలో సమ్మక్క -సారక్క పాఠ్యాంశం , 8 వ తరగతిలో హైదరబాద్ రాష్ట్ర విశేషాలు పాఠ్యాంశంగా వచ్చినవి! మన అక్క చేస్తూ వెళ్ళిన కృషి మూలంగా తెలంగాణ చరిత్ర , సంస్కృతులకు ప్రాదాన్యత లభించింది!

తెలంగాణ పండుగలు , జానపదాలు పుస్తకాల్లో అచ్చయినయి! ప్రాచీన శాసనం లో తెలంగాణ పురం అన్న ప్రస్తావన ఉండడం తో రాం చంద్రాపూర్ లోని తెల్లాపూర్ గ్రామానికి తెలంగాణ పురంగా పేరుపెట్టాలని అక్క డిమాండ్ చేసి సాధించింది! అప్పటి సినిమాల్లో తెలంగాణ భాష , యాసలను కించపరిచే వైనాన్ని ప్రశ్నించింది! ఆ క్రమం లోనే సినిమాల్లో తెలంగాణ కు ప్రాదాన్యత పెరుగుతూ వచ్చింది! వట్టికోట అళ్వారు స్వామీ లాంటి అనేకమంది తెలంగాణ సాహితీ శిఖరాలను గుర్తుకు తెచ్చింది! నిజాం రాష్ట్రాంద్ర మహా సభలు , మొదటి , రెండవ గ్రంథాలను పునహ్ ముద్రణకు పూనుకున్నది! తెలంగాణ మరో వైతాళికులు సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల సంచికను గ్రంథస్థం చేసింది! తనకున్న సాహిత్య అభిలాష తో ఇట్ల అనేక అంశాల్లో మన అక్క చరగని ముద్ర వేసింది ! రాష్ట్రం లో వాళ్ళ పార్టీ పురాగ చతికిల పడ్డ పరిస్థిని ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నరు ! డిపాజిట్ కు ఎక్కువ ! గెలుపుకు తక్కువ అనే పరిస్థితి నెలకొన్నది ! ఇప్పుడు మన అక్క తప్ప వాళ్లకు వేరే దిక్కు లేదు ! మన అక్కనే వాళ్లకు ఓ దారి దీపంలా కనబడుతున్నది ! ఆ పార్టీ లోని కొంత మంది నాయకులు ఢిల్లీ పెద్దలను బ్రతిమిలాడిండ్రు ! నోటీసు ఇచ్చి విచారిస్తే తప్ప మేము రాజకీయంగా బ్రతికి బట్టకట్టలేము అని కోరిండ్రు ! ఇప్పుడు వచ్చిన నోటీసు అందులో భాగమే ! నిజానికి ఇప్పుడు ఇచ్చిన నోటీసు అక్కను విచారించడానికి కాదు ! వాళ్ళ పార్టీ లోని నాయకులను సంతృప్తి పరచడానికి మాత్రమే అని గమనించగలరు !

You missed