సీనియర్ కాంగ్రెస్ లీడర్ ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారిందని తెలిసింది. హైదరాబాద్‌లోని న్యూరో సిటీ దవాఖానలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్‌పైనే చికిత్సలు అందుతున్న డీఎస్ ఆరోగ్య పరిస్థితిపై ఏం చెప్పలేమంటున్నారు వైద్యులు. కీలకమైన మెదడు ఆపరేషన్ తర్వాత ఆయన ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంలోనే ఉంటున్నాడు. సంజయ్ కాంగ్రెస్‌లో చేరే సమయంలోనే ఆయన గాంధీభవన్‌కు వీల్ చైర్ పైన వచ్చాడు.
ఆ తర్వాత ఆ కుటుంబంలో వివాదాలు మరింత రచ్చకెక్కాయి. తాను కాంగ్రెస్‌లో చేరలేదని డీఎస్ పేరుతో ఓ లేఖ విడుదలైంది. ఇదంతా అర్విందే చేపించాడని సంజయ్ .. డీఎస్‌తో వీడియో కాల్ మాట్లాడి అది మీడియాకు రిలీజ్ చేశాడు. అదే చివరి కాల్ సంజయ్‌తో. ఆ తర్వాత డీఎస్‌ను కలిసే చాన్స్ అరవింద్ ఇవ్వలేదు. ఇప్పుడు డీఎస్ చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రికి కూడా ఎవరినీ రానీయొద్దని కచ్చితమైన కండిషన్ పెట్టాడట ఆస్పిటల్ వర్గాలకు అరవింద్. దీనిపై మండిపడుతున్నారు డీఎస్ అనుచరులు. దీంతో డీఎస్ ఆరోగ్య పరిస్థితి నానాటికీ క్షీణిస్తున్న క్రమంలో ఇది అన్నదమ్ముల మధ్య మరింత ఆగాధాన్ని, రాజకీయ వివాదానికి తెరలేపుతున్నట్టుగా అక్కడ వాతావరణం ఏర్పడింది.