ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవితపై విచారణ ఎపిసోడ్‌ ఇంకా ముగియలేదు. రేపు ఉగాది పర్వదినం సందర్భంగా షార్ట్ బ్రేక్‌ ఇచ్చారు. అందుకే మళ్లీ ఎప్పుడు విచారణకు పిలుస్తారనేది ఈడీ క్లారిటీ ఇవ్వలేదు. ఉగాది తర్వాత మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ ఎపిసోడ్‌ను ఇంకా లాగుతున్నారు. కవితను అరెస్ట్ చేసేదాకా ఇదే పరంపరను కొనసాగించనున్నారు. ఇంతా చేసి కవితను అరెస్ట్‌ చేయకపోతే ఈడీకి, మోడీ ప్రభుత్వానికి మైలేజీ రాదు. పులిమీద స్వారీ చేస్తున్న కేంద్రం… కవిత అరెస్టు ద్వారానే ప్రజల్లో తామేంటో, తమ బలమేంటో చూపింపుకోవాలని చూస్తోంది. కానీ దీన్ని సాగదీస్తుంది.

బీఆరెస్‌ నాయకులు, ప్రజలు మానసికంగా కవిత అరెస్టు ఉంటుందని ఒప్పుకునే విధంగా.. ఇప్పుడున్న వేడి పూర్తిగా చల్లారే వరకు విచారణ ఎపిసోడ్‌ను ఇలాగే కంటిన్యూ చేయనున్నారు. మంగళవారం కూడా సేమ్‌ అదే కొనసాగింది. అంతకు మందు రోజులాగే పదిగంటల పాటు విచారణ చేసి వదిలేశారు కవితను. ఉగాదికి బ్రేక్‌ వేశారు. ఆ తర్వాత ఇది కంటిన్యూ అవుతుంది. అరెస్టు చేయడమనేది ఈ విచారణకు తుది ముగింపుగా ఈడీ, కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఇందులో అనుమానం లేదు. అప్పటి వరకు ఉత్కంఠ కొనసాగుంది. వేడి క్రమేణా చల్లారుతుంది. ప్రజలు మెంటల్లీగా ప్రిపేర్‌ అయిపోతారు ఇక కవిత అరెస్టు తప్పదని. అదే బీజేపీ వ్యూహం. ఆ వ్యూహ రచనలో భాగంగానే ఈ విచారణ ఎపిసోడ్‌ను కొనసాగిస్తోంది.

You missed