ప్లీజ్ సార్.. ఒక్క ప్రెస్‌మీటు.. ఒకే ఒకే ప్రెస్‌మీట్‌…. అంటూ కేసీఆర్ ఏం మాట్లాడ‌తాడో తెలుసుకోవాల‌నే ఉత్కంఠ‌ను భ‌రించ‌లేక సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల రిక్వెస్టు ఇది. అంతలా న‌రాలు తెగే ఉత్కంఠ మొన్న‌టి నుంచి రాష్ట్ర రాజ‌కీయాల్లో నెల‌కొంది. మొయినాబాద్ పామ్ హౌజ్లో న‌లుగురు టీఆరెస్ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకు బీజేపీ పంపిన ముగ్గురు బ్రోక‌ర్ల ఉదంతంపై కేసీఆర్ ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. కేటీఆర్ స్పందించాడు. ఆడియోలు విడుద‌ల చేశారు. యావ‌త్ జ‌నానికి స్ప‌ష్టంగా అర్థ‌మ‌య్యింది. ఇవాళ మునుగోడు నియోజ‌క‌ర్గం చండూరు బంగారి గ‌డ్డ లో కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌.

ఈ వేదిక‌గా ఆయ‌న నోరు విప్ప‌నున్నాడు. కేసీఆర్ ఏం మాట్లాడ‌తాడు..? టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం, బండి సంజ‌య్ యాదాద్రి ప్ర‌మాణం, కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ చీటింగ్ రాజ‌కీయం… అన్నీ .. అన్నీ అంశాలు ఆయ‌న స్పీచ్‌లో ప్రోదీ చేసుకోనున్నాయి. ఒక్క ప్రెస్‌మీట్ కోసం ముఖం వాచిపోయి ఎదురుచూస్తున్న జ‌నానికి, లీడ‌ర్ల‌కు, మీడియాకు.. ఇది వంద‌ల ప్రెస్‌మీట్ల పెట్టు. వాస్త‌వానికి ఇప్పుడు ఈ ఉప ఎన్నిక టీఆరెస్‌కు అత్యంత కీల‌కం.. బీఆరెస్ రూపాంత‌రం చెందిన త‌ర్వాత జ‌రుగుతున్న తొలి ఎన్నిక‌. దీని ఫ‌లితం ఆధారంగా కేసీఆర్ ఇటు రాష్ట్ర రాజ‌కీయాలే కాదు… దేశ రాజ‌కీయాల్లో త‌న స‌త్తా చూపేందుకు సిద్దం కానున్నారు. ఈ క్ర‌మంలో దీని పై మ‌రింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇవాళ జ‌రిగే బంగారిగ‌డ్డ భారీ బ‌హిరంగ స‌భ … కేసీఆర్ గ‌ర్జ‌న‌తో ద‌ద్ద‌రిల్ల‌నున్న‌ది. ఒక్క మునుగోడుకాదు.. రాష్ట్రం దేశం కేసీఆర్ స్పీచ్ కోసం ఉత్కంఠ‌క‌గా, ఆస‌క్తిగా, న‌రాలు తెగే టెన్ష‌న్‌తో ఎదురు చూస్తున్న‌ది…..

You missed