నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ గెలిచిన తరువాత జిల్లాకు చేసిందేమీ లేదు. బాండు పేపర్‌ రాసి గెలిచిన ఎంపీగా.. పసుపు రైతులకు ఎగనామం పెట్టిన ఎంపీగా బాగా కీర్తి గడించాడు. బోర్డు లేదు గీర్డు లేదు… ఆ వ్యవస్తే లేదు.. అంటూ మభ్యపెట్టి నాటకాలాడి మాయ చేస్తూ వచ్చి ఇలా లాస్ట్‌కు మోడీతో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తామని చెప్పి అది నా ఘనతే అని కాలర్ ఎగిరేసిన ఎంపీని అధిష్టానం బాగా గుర్తించింది. ఏం గుర్తింపు అంటారా..? అదే సోషల్‌ మీడియా టైగర్‌గా పనికొస్తావని. ప్రజలకు చేసేందీమే లేదు. చేయడానికీ ఏమీ లేదు. కానీ సోషల్‌ మీడియా వేదికగా నరం లేని నాలుకతో ఇష్టమొచ్చినట్టు తిట్టొచ్చు. బండ బూతులు మాట్లాడొచ్చు. దాన్ని సోషల్‌మీడియాలో తోసేసి తెగ వైరల్ చేసేయొచ్చు. అంత వరకే తమ పని. ఇది ఎంత బాగా చేస్తాడో కదా..! అందుకే అధిష్టానం అతనికి సోషల్‌ మీడియా కమిటీ చైర్మన్‌ను చేసేసింది ఏకంగా.

అవును మరి బీజేపీ సోషల్‌ మీడియాకు అంత ప్రయార్టీ ఇస్తుంది మరి. కానీ టీఆరెస్సే దాన్ని పట్టించుకోవడం లేదు. అందుకే టీఆరెస్‌ పరిస్థితి ఇలా దారుణంగా తయారయ్యింది. ఎంపీగా అర్వింద్‌ గెలిచిన తరువాత జనాలకు ఏమైనా మేలు జరిగిందా.. అంటే నయా పైసా కూడా జరగలేదనే చెప్పాలి. ఇందులో ఏ మాత్రం డౌట్‌ లేదు. అయితే మంత్రి ప్రశాంత్‌రెడ్డిని, లేదా ఎమ్మెల్సీ కవితను తిట్టాలి. కేసీఆర్ లేదా కేటీఆర్‌ను టార్గెట్ చేయాలి. పెద్ద గీత పక్కన చిన్న గీత గీస్తే తాను పెద్ద గీతనే అవుతాననే సిద్దాంతం బాగా వంట పట్టించుకున్నాడు అర్వింద్‌. నోటికొచ్చిన బూతులు మాట్లాడేస్తాడు. కొత్త బూతు రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అతనే. ఎంతగా తిడితే అంతగా జనం ఆదరిస్తారని ఫిక్స్‌ అయిపోయాడు. పాపం పిచ్చి జనాలు వాళ్లకేం తెలుసు. మాకేం చేశాడో కంటే.. అబ్బ ఎంత బాగా తిడుతున్నాడో కదా అని మురిసి పోయి మళ్లీ తనను ఎంపీగా గెలిపిస్తారని ఫిక్స్‌ అయిపోయాడు కాబోలు.

అందుకే అలా తన తిట్ల దండకాన్ని పెంచుతూ పోతున్నాడు. అధిష్టానం కూడా అర్వింద్‌ ‘టాలెంట్‌’ను గుర్తించింది. సోషల్‌ మీడియా కమిటీకి చైర్మన్‌ను చేసేసింది. ఇదో సంబురం మరి. పసుపు బోర్డు తెస్తానని ఐదేండ్లు మోసం చేసి కాలయాపన చేసి పసుపు రైతులను నిండా ముంచి ఇప్పుడు బోర్డు ఏర్పాటు చేస్తున్నాం చూశావా.. అంటూ కాలరెగరేసుకున్న ఎంపీది రెండు వైపులా పదునే. ఆనాడు అట్ల మాట్లాడినా చెల్లుబాటయ్యింది.. ఈనాడు ఇట్ల మాట్లాడినా చెల్లు బాటు అయ్యేలా చూసుకుంటున్నాడు. అందుకే అర్వింద్‌ ఓ పేపర్‌ టైగర్… కాదు కాదు… సోషల్‌ మీడియా టైగర్‌. ఈ టైగర్‌లతో జనాలకు ఒరిగేదేం లేదు. ప్రయోజనం చేకూరేదేమీ లేదు. బాలక్రిష్ట సినిమాలో తొడలు చరుచుకుని డైలాగులు విన్నట్టు.. ఎంతకాలం వింటారో ఈ రోత మాటలు, డైలాగులు.. దీనికీ ఓ పుల్‌స్టాప్‌ అవసరమే. అదీ తర్వలో.

You missed