రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాలు కలుపుకొని మొత్తం 20, 27, 547 మంది ఓటర్లున్నట్టు తుది జాబితాలో వెల్లడించారు. ఇందులో అత్యధికంగా నిజామాబాద్‌ అర్బన్ నియోజకవర్గంలో ఓటర్లు నమోదయ్యారు. అర్బన్‌లో 2, 86, 766 మంది ఓటర్లుండగా… ఇందులో మహిళా ఓటర్లు, 1, 47, 571 మంది, పురుష ఓటర్లు 1, 39,163 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం థర్డ్‌ జెండర్‌లు 96 మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా, ఇందులో అర్బన్‌ నుంచే అత్యధికంగా 32 మంది ఓటర్లుగా వీరు నమోదు చేసుకున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గంలో తక్కువగా ఓటర్లున్న నియోజకవర్గంగా బాన్సువాడ ఉంది. బాన్సువాడలో మొత్తం ఓటర్లు 1, 92, 841 మంది ఉండగా, ఇందులో మహిళా ఓటర్లు 1, 00, 608 మంది ఉండగా, పురుష ఓటర్లు 92, 225 మంది ఉన్నారు.

పలు దఫాలుగా ఓటర్ల నమోదు ప్రక్రియను పొడిగిస్తూ వచ్చిన ఎన్నికల సంఘం.. ఇక ఈ నెల 6 తర్వాత ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా వెలువడే అవకాశాలున్న నేపథ్యంలో తుది ఓటర్ల జాబితాను ప్రకటించేసింది. ఇప్పటికే ఓటర్ల నమోదు పై ప్రతిపక్షాలు పలు ఆరోపణలు చేశాయి. బోగస్‌ ఓట్లు నమోదయ్యాయని ఫిర్యాదులు రావడంతో జిల్లాకు ప్రత్యేక అధికారిగా వచ్చిన ఐఏఎస్‌ ఆఫీసర్‌ క్రిష్టినా దీనిపై ప్రత్యేకంగా నజర్ పెట్టారు. బోధన్‌, అర్బన్‌లలో చాలా బోగస్‌ ఓట్లు తీసేశారు. ఓటరు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. చివరకు ఇవాళ తుది జాబితాను ప్రకటించేశారు. ఇక ఇదే ఫైనల్‌ ఓటర్ల లిస్టు కానుంది.

నియోజకవర్గం     పురుష ఓటర్లు      మహిళా ఓటర్లు    ఇతరులు            మొత్తం

ఆర్మూర్‌              96, 404              1, 09, 933      07              2, 06, 344

బోధన్‌             1, 03,577          1, 12, 381          05               2, 15, 963

బాల్కొండ          99, 728              1, 15, 898         02                2,15, 628

నిజామాబాద్ అర్బన్‌ 1, 39,163          1, 47, 571        32                  2, 86, 766

నిజామాబాద్‌ రూరల్ 1, 16, 052        1, 32, 212         05                  2, 48, 269

బాన్సువాడ              92, 225         1, 00, 608         08                   1, 92, 841

ఎల్లారెడ్డి               1, 04, 774        1, 12, 673         03                   2,17, 444

కామారెడ్డి             1, 18, 725         1, 27, 080        24                    2, 45, 822

జుక్కల్‌ (ఎస్సీ)           97, 622         1, 00, 269         10                    1, 97, 897

సర్వీస్‌ ఓటర్లు                                                                                       556
……………………………………………………………………………………………………..
                          9, 68,270       10, 58, 625        96                    20, 27, 547
………………………………………………………………………………………………………….

 

You missed