సంక్షేమానికి పెద్దపీఠ వేయకపోవచ్చు కానీ జన్మభూమిని ప్రవేశపెట్టింది ఆయనే ! పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టకపోవచ్చు కానీ ఇంకుడు గుంతలను తవ్వించింది ఆయనే ! కరెంటు కష్టాలు తీర్చకపోవచ్చు కానీ సెల్ ఫోన్ లో టార్చ్ లైట్ వెలుగులు తెచ్చింది ఆయనే ! ఓటుకు నోటు లో కీలక సూత్రధారి కావచ్చు కానీ ప్రజాస్వామ్య సూత్రాలను వల్లె వేసింది ఆయనే ! అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించి ఉండవచ్చు కానీ ఉద్యమాలను అదుపులో పెట్టింది ఆయనే ! ఉచిత కరెంటు అడిగిన రైతులపై కాల్పులు జరిపించి ఉండవచ్చు కానీ శాంతి భద్రతలు కాపాడింది ఆయనే ! వ్యవసాయం దండుగ అనవచ్చు కానీ ల్యాన్డ్ పూలింగ్ పేరుతో రైతుల భూములు సేకరించిన రైతు బాంధవుడు ఆయనే ! ఆయన అరెస్టు ను నేను తీవ్రంగా ఖండిస్తున్న !

TTR

You missed