DANDUGULA SRINIVAS

తెలంగాణ ఏర్పాటుతో ఏపీకే పరిమితం కావాల్సి వచ్చిన కమ్మ, రెడ్డి రాజకీయ లాబీయింగ్‌లో కమ్మవర్గం ఓడిపోయింది. కాదు చచ్చిపోయింది. చంపింది ఏపీ సీఎం జగన్‌. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ గుప్పిట పట్టి, న్యాయ వ్యవస్థల్నీ తమ కనుసన్నల్లో ఉంచుకున్న కమ్మ రాజకీయ పెత్తానానికి జగన్‌ తూట్లు పొడిచాడు. ఇక కమ్మ రాజకీయం ఏపీలో బలైంది. సమాధిలోకి పోయింది. అది లేవడం అసాధ్యం. ఇదో చారిత్రక ములుపు ఏపీ రాజకీయాల్లో. జగన్‌ రాజకీయ చరిత్రలో ఓ మైలురాయే. తమకు తిరుగులేదనే విధంగా ఏళ్లకు ఏళ్లు రాజ్యామేలిన కమ్మ దురహంకార పెత్తనం ఇక అక్కడ చెల్లుబాటు కాదు. చంద్రబాబు జైలు ఊచలు లెక్కపెడతాడని అక్కడెవరూ కనీసం కలలో కూడా ఊహించి ఉండరు.

కానీ జగన్‌ ఆ కల కన్నాడు. దాన్ని నిజం చేసుకోవడం కోసం సమకాలీన రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. గట్టి ఆధారాలు సంపాదించాడు. కానీ జైలుకు పంపడమంటే మాటలేం కాదు. జగన్‌కు కేంద్రం సపోర్టు దొరికింది. బీజేపీ హవా తగ్గింది అంతటా. అందుకే మోడీ ఎక్కడికక్కడ అందరితో మంచి సంబంధాలనే కొనసాగిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగానే ఏపీలో జగన్‌తో రాజకీయ అవసరం మోడీకి తప్పనిసరి. దీన్ని జగన్‌ పసిగట్టాడు. సమయం చూసి దెబ్బకొట్టారు. ఆ దెబ్బకు మళ్లీ బాబు, టీడీపీ లేవనంతగా. చావుదెబ్బ. కమ్మ వర్గం తప్ప ఏ వర్గం ఎదిగినా చిదిమేసి, అణిచేసి బొందపెట్టే రాజకీయాలు నడిపిన కమ్మ లీడర్ల ఇది ఊహించని షాక్‌. తేరుకోలేని చావు దెబ్బ. ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిన కాపు వర్గాన్ని తుడిచిపెట్టేసిన కమ్మ రాజకీయ లాబీ ఇప్పుడు జగన్‌ దెబ్బకు బొందలో పడ్డది. వంగవీటి రంగా నుంచి మొదులుకొని ఏ ఒక్కరినీ బతకనీయని చరిత్ర టీడీపిది. కమ్మ రాజకీయ లీడర్లది. ఉదయం పత్రిక మూత వెనుకా ఈ కమ్మ రాజకీయమే ఉంది. సాక్షినీ బొంద పెట్టే ప్రయత్నం చేసినా అది జరగలేదు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు.

స్టేల మీద స్టేలు తెప్పించుకుని … అమరావతి రాజధాని భూముల విషయంలో ఎఫ్‌ఐఆర్‌ సైతం నమోదు చేయొద్దనే తీర్పు చెప్పించుకున్న బాబు… ఇప్పుడు ఇలా అదే న్యాయ వ్యవస్థ చేతిలో చిప్పకూడు తింటున్నాడు. రామోజీనీ దెబ్బ తీయడంలో జగన్‌ పై చేయిగా నిలిచాడు. పగ సాధిస్తున్నాడు. అదీ తనకు కలిసివచ్చిన అవకాశాన్ని వాడుకుని. కేంద్రం పవర్‌ను, తన అనుకూలతలను అవకాశంగా తీసుకుని రాజకీయ వ్యూహంలో ఆరితేరాడు. ఎదురుదెబ్బ తీశాడు. మీడియాను చెరబట్టి అంతా తన పాటే పాడించుకున్న కమ్మ లీడర్ల లాబీకి ఇక చెల్లు చీటి పడినట్టే. ఏపీ రాజకీయాల్లో ఇదో చరిత్ర. కమ్మ రాజకీయ వర్గం అంతానికి ఇదే ఆది.. అంతం కూడా.

You missed