కొత్త సెక్రటేరియట్ ఓపెన్ అయ్యాక మొదటిసారి మీడియా సెంటర్ కి వెళ్ళా ఈరోజు. దశాబ్దాలపాటు సెక్రటేరియట్ ఆవరణలో వున్న మీడియా సెంటర్ కాంపౌండ్ అవతలికి మారడం, అందుకు జర్నలిస్టు సంఘాలు, నాయకులు అభ్యంతరం చెప్పకపోవడం, నిరసన తెలపకపోవడం విషాదం.
ప్రత్యేక తెలంగాణ సాధన కోసం జర్నలిస్టులు చేసిన పోరాటంలో సెక్రటేరియట్ కి ఎంతో ప్రాముఖ్యత వుంది. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం ఐడెంటిటీ కార్డు చూపించి సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి కార్యాలయం లోపలి వరకూ నేరుగా వెళ్ళే అవకాశం వుండేది. ఏ మంత్రి ఆఫీసుకైనా, ప్రిన్సిపల్ సెక్రటరీల ఆఫీసులకు వెళ్లి మాట్లాడి వార్తలు సంపాదించే అవకాశం వుండేది.
జర్నలిస్టులు బోడి మల్లన్నలు.
K V kurmanath