ఆయనంతే మాస్‌ లీడర్‌. అనుకుంటే సాధిస్తాడు. పట్టుబడితే వదలడు. నా అనుకన్న వాళ్లకు ఏదైనా చేయలనుకుంటాడు. దాని కోసం ఏమైనా చేస్తాడు. ఎంతదాకైనా వెళ్తాడు. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాడు. ఎన్నో అనుభవాలు. మరెన్నో అవమానాలు. అయినా దేనికి తలవొంచడు. మొక్కవోని విశ్వాసం. పొగడ్తకు రొమ్ము విరిచి.. అవమానానికి కుంగిపోయే రకం కాదు. అందుకే ఆయన మాస్‌ లీడర్‌ అయ్యాడు. తన చిరకాల మిత్రుడు, తెలంగాణ ఉద్యమకారుడు…. సీనియర్‌ బీఆరెస్‌ లీడర్‌ ఈగ సంజీవరెడ్డికి పదవి ఇప్పించాలనుకున్నాడు. అదీ నుడా. నిజామాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కి చైర్మన్‌ గిరీ.

కానీ అది తొందరగా సాధ్యపడలేదు. ఆలోపు ఒలంపిక్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చక్రం తిప్పాడు. పదవి ఇప్పించారు. అయినా ఏదో వెలితి. స్నేహితుడికి మాటిచ్చాను. నుడా ఇప్పిస్తానని. ఎలా..? మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌లతో సమన్వయం చేసుకున్నాడు. ఎప్పుడు ఎలా కలిసినా… ఈ ముచ్చట మాత్రం వీరి వద్ద తీయడం… అవకాశం కోసం ఎదురుచూడటం.. మొత్తానికి సాధించాడు. ఈగ సంజీవరెడ్డికి నుడా ఇప్పించగలిగాడు గోవన్న. దటీజ్‌ గోవన్న. ఇక్కడ గోవన్న గురించే కాదు… కవిత గురించి కూడా చెప్పాలే. ఉద్యమకాలం నుంచి ఓపిక పట్టి పార్టీ పటిష్టత కోసం బాగు కోసం పరితపించినా అందరినీ ఆమె కన్నతల్లిలా కడుపులో పెట్టి చూసుకుంటున్నది.

పదవులు ఇప్పించడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నది. నిజామాబాద్‌ జిల్లాకు ఆమే ఇప్పుడు పెద్ద దిక్కు. మళ్లీ బీఆరెస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయించే దిశగా ఆమె అందరినీ ఒక్కతాటిపైకి తెస్తున్నారు. ప్రతిపక్షాలకు ధీటైన సవాల్‌గా నిలుస్తున్నారు. బరిగీసి యుద్దక్షేత్రంలో నిలుస్తున్నారు. అందరికీ ఆమె నేతృత్వంలో, నాయకత్వంలో న్యాయం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ సందర్బంగా వాస్తవం ఈగ సంజీవరెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నది. ఆయన ఓపిక, కమిట్‌మెంట్‌ను అభినందిస్తున్నది.

You missed