సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలు ఏది నిజమో..? ఏది అబద్దమో కూడా తెలియడం లేదు. ఫోటో ఒకటైతే దానికి వార్త మరోటి జోడించి వైరల్‌ చేస్తున్నారు. ఎక్కడిదో వార్త అయితే అది మన దగ్గరే జరిగిందంటూ కలరింగ్‌ ఇస్తారు. దీన్ని గుడ్డిలా ఫాలో అవుతున్న జనం.. షేర్లు చేస్తూ దాన్ని మరింత వైరల్ చేసేస్తున్నారు. మొన్న ఐశ్వర్యరాయ్‌ కూతురు చనిపోయిన ఉదంతంలో యూట్యూబ్‌ ఛానళ్లకు కోర్టు మొట్టికాయలు వేసే దాకా వెళ్లింది. వారికి నోటీసులు కూడా ఇచ్చింది. అయితే సామాన్య జనానికి అది నిజమో కాదో తెలియక అలా గుడ్డిగా ఫాలో అవుతున్నారు.. గొర్రెల మందలా ఒకరికి మించి మరొకరు షేర్లు చేసుకుంటున్నారు బాగానే ఉంది.

కానీ ఈనాడు కూడా తప్పులో కాలేసింది. ఓ వార్తను బ్లైండ్‌గా ఫాలో అయ్యింది. గోతిలో పడ్డది. ఇంత వ్యవస్థ ఉన్న ఈనాడే ఇలా ఎలా రాసిందబ్బా.. ఏ మాత్రం నిజనిజాలు తెలుసుకోవద్దా అంటూ ఇప్పుడు అదే సోషల్‌ మీడియా మొట్టికాయలు వేయడం మొదలు పెట్టింది. అసలు విషయానికొద్దాం.. హైదరాబాద్‌లోని ఓ సమాధి ఫోటో అది. దానికి కంచెలాంటిది వేశారు. ఈ స్థలాన్ని తవ్వి వేరొకరు మళ్లీ అదే చోట సమాధి చేయకుండా ఉండేందుకు ఇలా చేశారు. కానీ దీన్ని పాకిస్థాన్‌లో ఫోటోగా ప్రచారం చేయడమే కాదు.. శవాలను వెలికి తీసి కామాంధులు కొందరు అత్యాచారాలు చేస్తున్నారంటూ కథనాలు వచ్చాయి. దీన్నే కొన్ని ప్రధాన మీడియా సంస్థలు తమ సైట్‌లలో రాసుకున్నాయి. ఈనాడూ దీన్ని గుడ్డిగా ఫాలో అయి ఇలా చివాట్లు తిన్నది.

You missed