బీఆరెస్‌ కర్ణాటకలో పోటీ చేయాల్సింది. చేద్దామనే భావించారు కేసీఆర్‌. కానీ సమయం తక్కువగా ఉంది. అక్కడ రాజకీయాలపై కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉంది. తన రాజనీతితో ఆలోచించారు. వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అంతిమంగా పోటీ చేయొద్దనే నిర్ణయానికి వచ్చారు. ఒకవేళ పోటీ చేస్తే కాంగ్రెస్‌కు ఓ ముప్పై సీట్ల వరకు సంఖ్యాబలం తగ్గేది. జేడీఎస్‌కూ కొన్ని సీట్లు పెరిగేవి. బీఆరెస్‌ పోటీ చేయడం మూలంగా ఓట్లు చీలడమేది ప్రధానంగా జరిగే ప్రమాదం. దీన్ని కేసీఆర్‌ వూహించారు. అందుకే ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఓట్లు చీలడం మూలంగా కాంగ్రెస్‌కు కొంత నష్టం జరిగి.. బీజేపీ బలమైన పార్టీగా అక్కడ అవతరించేది.

బీఆరెస్‌ పోటీ చేయకపోవడంతో బీజేపీని .. బీజేపీయేతర ప్రతిపక్ష శక్తులు ఓడించవచ్చనే సంకేతాలిచ్చినట్టైంది. ఈ విషయంలో కేసీఆర్‌ సంకుచితంగా ఆలోచించి కొన్ని సీట్లతో సరిపెట్టుకోవాలనుకోలేదు. విశాల దృక్పథంలో ఆలోచించారు. కాంగ్రెస్‌ అక్కడ బలంగా ఉంది. దీన్ని బలంగానే ఉంచాలనుకున్నారు. పలుచన చేయొద్దనేది కేసీఆర్‌ వ్యూహం. తను బరిలోకి దిగి .. శత్రువైన బీజేపీని బలపర్చడం రాజనీతి కాదని గ్రహించారు. అందుకే ఆయన కర్ణాటక ఎన్నికల్లో బీఆరెస్‌ను వ్యూహాత్మకంగానే బరిలోకి దింపలేదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ ఫలితాలు .. బీజేపీని ప్రతిపక్షాలు ఓడించొచ్చు. బీజేపీ కాలం చెల్లిందనే సంకేతాలివ్వగలిగాయి. అక్కడే కేసీఆర్‌ విజయం సాధించారు. తెరవెనుక ఉన్నా.. కర్ణాటక రాజకీయాలకు దూరంగా ఉన్నా… ఆయన ఈ ఎన్నికల ద్వారా రాజనీతితో వ్యూహాత్మక అడుగులు వేశారు. అనుకున్నది సాధించారు.

You missed