చేసేది త‌ప్పు. పెట్టేవి వాత‌లు. పెంచేవి ధ‌ర‌లు. పేదోడి జేబుకు ఎడాపెడా చిల్లులు పెట్ట‌డ‌మే డ్యూటీ గా మార్చుకున్న మ‌నం….. పైగా స‌మ‌ర్థింపు మాటాలా..? ఇవేలా ఉన్నాయంటే… క‌ర్రు కాల్చి వాత‌లు పెడుతున్న‌ది మన‌మే.. ఆ మంట ఉప‌శ‌మ‌నానికి క‌నీసం బ‌ర్నాల్ కూడా రాయ‌డం మాట‌టుంచి… ఇంకా దాన్ని బ‌ర్నింగ్ చేసేలా ఈ మాట‌లెందుకు మేడం..? ఇప్ప‌టికే మీరు మాట్లాడిన మాట‌లు.. చాలా సంద‌ర్భాల్లో న‌వ్వుల‌పాల‌య్యాయి. కొంద‌రు మాట్లాడితే వారి జ్ఞాన‌మెంతో తెలిసిపోతుంది. మ‌న ద‌గ్గ‌ర విష‌యం లేన‌ప్పుడు ఎక్కువ‌గా ఎప్పుడు ప‌డితే అప్పుడు మాట్లాడ‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం. అది కూడా మ‌న‌కు అనుభ‌వ‌మే.

కానీ ఎందుకో నోరు ఊకోదు. ఏదో ఒక‌టి వాగాల‌నిపిస్తుంది. ఉల్లిగ‌డ్డ‌ల రేటు ఇంత‌లా పెరిగిందెందుకు..? అంటే .. ఏమో నాకేం తెలుసు నేనేమ‌న్నా వంటింట్లోకి పోతానా అని అన‌బుద్ది అవుతుంది. రేష‌న్ షాపుల వ‌ద్ద మోడీ ఫోటో లేక‌పోతే కోపం న‌శాళానికి అంటుతుంది. మోడీ మీద ప్రేమ‌తో క‌లెక్ట‌ర్‌ను కూడా తిట్టాల‌నిపిస్తుంది. క్లాస్ పీకాల‌నిపిస్తుంది. రేష‌న్ బియ్యంలో కేంద్రం వాటా ఎంతో ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయ‌కుండా చేస్తున్న సీఎం కేసీఆర్‌ను ర‌క్కి ర‌క్కి చంపాల‌నిపిస్తుంది.

అయినా…నా గురించి తెలిసి కూడా మీడియా కావాల‌నే నాకు ఇలాంటి క్వ‌శ్చ‌న్లు వేస్తుంది. ఏడాదికి మూడు సిలిండ‌ర్లు స‌రిపోవా..? అని అన్నాను. ఇందులో త‌ప్పేముంది. పొదుపుగా వాడుకోవ‌డం కూడా మేము అల‌వాటు చేస్తున్న‌ట్టు అనుకోవచ్చు క‌దా.. ఏంటీ…? వంటింట్లోకి వెళ్ల‌వు క‌దా.. నీకెలా తెలుసు.. మూడు స‌రిపోతాయ‌ని… అని అడుగుతున్నారా..? అప్పుడు అడిగిన క్వ‌శ్చ‌న్‌కు వంటింట్లోకి వెళ్ల‌లేదు.. ఇప్పుడు ఇచ్చిన ఆన్స‌ర్‌కు వంటింట్లోకి వెళ్లి వ‌చ్చి మ‌రీ చెబుతున్నా.. స‌రేనా.. స‌రిపోయిందా.. రాసుకో పో .. నీ ఇష్టం వ‌చ్చింది.

You missed