పార్లమెంటు భవన ప్రారంభోత్సవం ఎందుకు బహిష్కరిస్తున్నట్టు..?
మోదీకి ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం లేదు.
పార్లమెంటరీ సంప్రదాయల మీద గౌరవం లేదు.
ఈ విషయంపై దేశ వ్యాప్తంగా చర్చపెట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలి.
దీనిపై ప్రజాభిప్రాయం కూడగట్టాలి. అందులో భాగంగా తాము బహిష్కరించాలి.
ఈ విషయంలో బీఆరెస్‌ వ్యూహం ఏమిటీ…? సర్వత్రా ఆసక్తికరంగా మారిన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం….

కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని పలు ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. 19 ప్రతిపక్ష పార్టీలు ఈ మేరకు సంయుక్త ప్రకటన జారీ చేశాయి. గిరిజన సామాజిక వర్గానికి చెందిన రాష్ట్రపతి ముర్మును ఆహ్వానించకుండా, ప్రధాని మోడీ తానే స్వయంగా ప్రారంభించడం అవమానకరమని ప్రతిపక్షాలు తమ ప్రకటనలో తప్పుబట్టాయి. ప్రజాస్వామ్యాన్ని హరించిన తర్వాత ఇక పార్లమెంటు భవనానికి విలువ ఏముంటుందని ఆ పార్టీలు ప్రశ్నించాయి. అయితే ఈ పార్టీలు అనుసరిస్తున్న విధానం ప్రజలను ఆకట్టుకునే విధంగా లేదు. శుభం పలకరా పెండ్లి కొడకా… అంటే ఏదో అన్నట్టు కొత్త పార్లమెంటు ఘనంగా కట్టుకుని ప్రారంభించుకుంటూ ఉంటే ఏదో ఒక సాకుతో, రాజకీయ కారణాలతో ప్రతిపక్షాలు బహిష్కరిస్తున్నాయనే అభిప్రాయం ప్రజలకు కలిగే విధంగా ఈ ప్రకటన ఉన్నది. తాము బహిష్కరించడానికి ఒక సాకును ప్రతిపక్షాలు వెతుక్కున్నాయనే అభిప్రాయం కలిగించేదిగా ఈ ప్రకటన ఉన్నది.

ఇందుకు రాష్ట్రపతి ముర్మును రాజకీయాల కోసం వాడుకుంటున్నట్టుగా తప్ప ప్రజలను మెప్పించేదిగా లేదు. పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించదలుచుకుంటే తప్పేమీ లేదు. కానీ అందుకు తగిన రీతిలో కారణాలు చెప్పగలగాలి. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ సంప్రదాయాలు క్షీణించాయి.మోదీకి ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం లేదు. పార్లమెంటరీ సంప్రదాయల మీద గౌరవం లేదు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారు. బీజేపీ నాయకులు మత విద్వేషాలను రగిలుస్తున్నారు. భారత రాజ్యాంగ విలువలు కాలరాస్తున్నారు. ఈ విషయంపై దేశ వ్యాప్తంగా చర్చపెట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలి. దీనిపై ప్రజాభిప్రాయం కూడగట్టాలి. అందులో భాగంగా తాము బహిష్కరించాలి. కానీ అవేమీ చేయకుండా పార్లమెంటు భవనాన్ని బహిష్కరించడం ప్రతిపక్షాల బలహీనతనే వెల్లడిస్తున్నది.

తెలంగాణ సాలిడారిటీ ఫోరం…

You missed