కేంద్ర ఆర్థిక మంత్రి. నిర్మ‌ల సీతారామ‌న్‌. ప్ర‌తీసారి ఏదో మాట్లాడి మ‌రింత ప‌లుచ‌న‌వుతూ వస్తున్న‌ది. త‌నకు తాను లోకువ అవ్వ‌డ‌మే కాదు…. పార్టీ ప‌రువునూ బ‌జారుకీడుస్తున్నారామె. మిడిమిడి జ్ఞాన‌మో…. తెలిసి తెలియ‌ని త‌న‌మో… ఏదో స‌మ‌ర్థింపు కోసం పోతే.. ఉన్న ఇజ్జ‌త్ తీసుకోవ‌డ‌మో.. ఏదో తెలియ‌దు కానీ.. ఆమె మాట్లాడే ప్ర‌తీ మాటా.. సంద‌ర్భ‌మూ రెండూ అభాసుపాల‌వుతున్నాయి. న‌వ్వులు పూయిస్తున్నాయి. వెట‌కారం జోడించి సోష‌ల్ మీడియాలో ఆడుకోవ‌డానికి కావాల్సిన స‌రుకును అందిస్తున్నాయి.

ఒక్క‌సారి కాదు.. రెండు సార్లు కాదు… వ‌రుస‌గా ఆమె ఏ సంద‌ర్భంలో ఏది మాట్లాడినా అది బూమ‌రాంగ్ అయి కూర్చుంటుంది. పాఫం.. నిర్మ‌ల‌క్క బ్యాడ్‌ల‌క్‌. తాజాగా ఇగో ఇలా రూపాయి ప‌త‌నం.. డాల‌ర్ బ‌లుపుపై ఆమె మాట్లాడటం మ‌రింత న‌వ్వు తెప్పించి…. ఇలా వెట‌కారం పాలు మ‌రికాస్త ఎక్కువ జోడించి ఆడుకుంటున్నారు నెటిజ‌న్లు. ప్ర‌తీసారి సెంటిమెంటు మాట‌లనే న‌మ్ముకుంటే కుద‌ర‌దు. స‌బ్జెక్టు బేస్డ్ కంటెంట్ వ‌చ్చిన‌ప్పుడు తెలుసుకోవాలి. తెలిసి మాట్లాడాలి. లేదా నోర్ముసుకు కూర్చోవాలి. కానీ ఇలా ఏది ప‌డితే అది.. ఎలా ప‌డితే అలా మాట్లాడితే .. నలుగురిలో నగుబాటు త‌ప్పుదు మ‌రి …

You missed