కర్ణాటక రాజకీయాలు ఎటో మలుపుతిరుగుతాయని ఆశించిన కొన్ని పక్షాలకు, నాయకులకు చుక్కెదురైంది. ఏకంగా సోనియా గాంధీ రంగంలోకి చక్రం తిప్పడంతో పరిస్థితి సెట్ అయిపోయింది. డీకే శివకుమార్‌ తపకే సీఎం కావాలనే మొండిపట్టు వెనుక ఈ రాజకీయాలు ఎటుపోతాయోనని ప్రత్యర్థి శిబిరాలు గోతికాడి నక్కలాగా ఎదురుచూశాయి. రాహుల్ మంతనాలు జరిపినా ఓ దశలో డీకే శివకుమార్‌ వినలేదు. చివరకు సోనియా చక్రం తిప్పింది. డీకే తో మాట్లాడింది.

డీకే డిమాండ్లన్నీ ఓపిగ్గా విన్నది. అన్నింటికీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సీనియారిటీ ప్రకారం సిద్దరామయ్యను సీఎం చేయడమే పార్టీకి మేలు జరుగుతుందనే ఒకే ఒక మంత్రంతో సోనియా డీకే మనసును మార్చేసింది. దీంతో డీకే కూడా ఇప్పటికిప్పుడు సీఎం పదవి వద్దనుకున్నా… డిమాండ్లను ఆమె ముందుంచాడు. ఉప ముఖ్యమంత్రిగా తనకు మాత్రమే ఇవ్వాలని, ఇద్దరి ముగ్గురికి ఇవ్వొద్దన్నాడు. ఓకే అన్నది సోనియా. రెండేండ్ల తర్వాత మూడేండ్ల పాటు తనకు సీఎం ఇవ్వాలనే కూడా ప్రధాన డిమాండ్‌.. దీనికీ ఆమె ఓకే చెప్పేశారు. దీంతో కర్ణాటక రాజకీయాలు సుఖాంతమయ్యాయి. ఈనెల 18న జరగాల్సిన ప్రమాణ స్వీకారం 20కి వాయిదా పడింది. కేసీఆర్‌ ఈ ప్రమాణ స్వీకారానికి పిలుపు ఉంటుందా..? ఉంటే ఆయన వెళ్తారా..? అనేది మళ్లీ చర్చకు వచ్చింది.

You missed