ఒక‌టి అధికార పార్టీ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌. నిధుల‌కు కొర‌త లేదు. జీతాల‌కు కొద‌వ లేదు. కానీ ఉన్న‌ప‌ళంగా క‌రోనా వేళ వంద‌లాది మంది రిపోర్ట‌ర్లు, స‌బ్ ఎడిట‌ర్ల‌ను పీకేసింది. కొత్త ఎడిట‌ర్ కృష్ణ‌మూర్తి చేసిన నిర్వాకం ఇది. దీనికి యాజ‌మాన్యం వంత పాడింది. అధికార ప‌క్షం చేష్ట‌లుడిగి చూసింది. వంద‌లాది క‌టుంబాలు రోడ్డున ప‌డ్డాయి. అంత‌గా క‌ర్క‌శంగా ప్ర‌వ‌ర్తించింది న‌మ‌స్తే తెలంగాణ‌.

దిశ‌. మొన్న మొన్న పుట్టిన ఓ డిజిట‌ల్ మీడియా. చాలీ చాల‌ని నిధులు. అయినా న‌మ‌స్తే తెలంగాణ నుంచి గెంటివేయ‌బ‌డ్డ చాలా మందికి ఇది షెల్ట‌ర్‌ అయ్యింది. అక్కున చేర్చుకున్న‌ది. ఆ స‌మ‌యంలో ఎక్క‌డా గుక్కెడు మంచినీళ్లు కూడా ఇచ్చే ప‌రిస్థితులు లేవు. ఇంక ఉద్యోగాల విష‌యం మ‌రిచిపోవాల్సిందే. బతికుంటే చాలు అనుకునే ప‌రిస్థితి. అలాంటి క‌ష్ట స‌మ‌యంలో దిశ వారిని ఆదుకున్న‌ది. ఆద‌ర్శంగా నిలిచింది.

ఇప్పుడు జ‌మీర్ విష‌యంలో కూడా. ఎన్టీవీలో ప‌నిచేసిన జ‌మీర్ ప్ర‌మాద‌వ‌శాత్తు చ‌నిపోతే ఆ కుటుంబానికి 50వేల ఆర్థిక స‌హాయం అందించి ఆదుకున్న‌ది. బాస‌ట‌గా నిలిచింది.

You missed