Category: Editorial

‘నమస్తే’ను ‘ఆంధ్రమయం’ చేసిందెవరు.. కృ.తి..? తెలంగాణ జర్నలిస్టులను అవమానించి బయటకు పారదోలి.. కోబ్రాలను నెత్తికెత్తుకుంది నువ్వు కాదా..? కేసీఆర్‌ నిన్ను నెత్తికెత్తుకుంటే.. నువ్వు నమస్తే తెలంగాణ పత్రికకు చేసిన మేలేమిటి..? రెండొందల మంది జర్నలిస్టులు,ఉద్యోగులను రోడ్డుపాలు చేసి, ఆంధ్ర ఉద్యోగులతో నింపుకున్నది ఎవరు..? ఇంత జరుగుతున్నా ప్రేక్షకపాత్ర పోషించిన సవాల్‌ రెడ్డీ.. ఎవరు అర్బకులో చెప్తావా..?

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: మొన్న నమస్తే తెలంగాణలో పెద్ద వార్తొకటొచ్చింది. ‘టీఎస్‌పీఎస్సీలో ఆంధ్ర సభ్యడ’ని. ఈ వార్త చూసి నమస్తే తెలంగాణ సిబ్బంది, ఉద్యోగులు, జర్నలిస్టులు నవ్వుకున్నారు. నమస్తే తెలంగాణకు ఎడిటర్‌గా తీగుళ్ల కృష్ణమూర్తిని తీసుకొచ్చి పెట్టిన తరువాత ఆంధ్ర…

‘ చంద్రబాబు జైలు’ ను లైట్‌ గా తీసుకున్న ‘తెలంగాణ’ … ఆంధ్రా మీడియాలోనే హల్‌చల్, తెలంగాణ ప్రింట్‌మీడియాలో దక్కని ప్రాధాన్యం… రెండో పేజీకి పరిమితం చేసిన ‘నమస్తే’

ఆంధ్ర రాజకీయాలపై తెలంగాణ ప్రజల ఆసక్తి తగ్గింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అక్కడ జరిగే రాజకీయ పరిణామల కరెంట్‌ ఎఫైర్స్‌పైనా శ్రద్ద తగ్గింది. ఒక్కసారిగా స్కిల్ స్కామ్‌ పేరిట చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం… ఆ తర్వాత రిమాండ్‌ అంశాలను ఆంధ్రా…

ఇతనో నిత్యవిద్యార్థి… రాజకీయాల్లో బిజీబిజీ…. పుస్తక పఠనమంటే ఎంతో క్రేజీ.. ఇప్పటికీ ఖాళీ సమయాల్లో నవలలు చదవడం జగన్ హాబీ… తెలుగు, ఇంగ్లీష్‌ సాహిత్యంపై పట్టు… కాలేజీ రోజుల నుంచి అలవాటును అలా కంటిన్యూ చేస్తున్న యువనేత.. అసమర్థుని జీవయాత్ర… అన్ని తరాలకు ఎప్పటికీ మార్గదర్శకమేనని సమీక్ష.. కేశవరెడ్డి రచనా శైలంటే ఇష్టం… సాహిత్యలోకానికి దూరమవుతున్న నేటి యువతరానికి ఈ యువనేత ఆదర్శప్రాయమే…

ఇతనో నిత్యవిద్యార్థి… రాజకీయాల్లో బిజీబిజీ…. పుస్తక పఠనమంటే ఎంతో క్రేజీ.. ఇప్పటికీ ఖాళీ సమయాల్లో నవలలు చదవడం జగన్ హాబీ… తెలుగు, ఇంగ్లీష్‌ సాహిత్యంపై పట్టు… కాలేజీ రోజుల నుంచి అలవాటును అలా కంటిన్యూ చేస్తున్న యువనేత.. అసమర్థుని జీవయాత్ర… అన్ని…

ఔను… కవిత అంటే తెలుగు మీడియాకు కక్షే…! లిక్కర్‌ కేసులో ఆమెపై ఆరోపణలకే అధిక ప్రాచుర్యం.. పబ్లిసిటీ… వివరణలకు అంత ప్రయార్టీ ఇవ్వని మీడియా… అంతో ఇంతో దిశే నయం… నమస్తే తెలంగాణ మరీ అధ్వానం..

ఢిల్లీ లిక్కర్‌ కేసులో తనతో సుఖేశ్‌ వాట్సాప్‌ చాటింగ్‌ చేశాడు. డబ్బుల పంపకం జరిగిందని రిలీజ్‌చేసిన లేఖను తెలుగు మీడియా కళ్లకు అద్దుకుని మరీ పతకా శీర్షికన ప్రచురించి జబ్బలు చరుచుకుంది. ఆ మరుసటి రోజు కవిత ఇదంతా ఫేక్‌. అతనికీ…

“ఒక డస్ట్ బిన్ ని, కుర్చీని, ఒక కంప్యూటరుని ఎలా షిఫ్ట్ చేస్తామో, ఒక ఉద్యోగిని (జర్నలిస్టుని) కూడా అదేవిధంగా మార్చేయడం అన్యాయం..పెందుర్తి ప్రభాకర్ చనిపోయాడు…ఆంధ్రజ్యోతి పాత్రికేయ సిబ్బంది ప్రక్షాళన క్రతువులో తొలి బలి! #ABNAndhraJyothyDiaries

బలిగంప బయిల్దేరింది… ——————- పెందుర్తి ప్రభాకర్ చనిపోయాడు. ఆంధ్రజ్యోతి పాత్రికేయ సిబ్బంది ప్రక్షాళన క్రతువులో తొలి బలి! * * ప్రభాకర్ నా కంటే ఓ ఏడాది చిన్నవాడే. నాకు లానే చానాళ్లుగా చక్కెర వ్యాధితో బాధపడుతున్నవాడే. అయితే, ఆయన అకాలమరణం…

జర్నలిస్లుల ఇళ్ల స్థలాలు…. చాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాట… కేటీఆర్‌ కామెంట్‌తో చిక్కుముడి పడిన హైదరాబాద్‌ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీ…సుప్రీం తీర్పు ఇచ్చినా.. అందరికీ ఒకేసారి ఇవ్వాలన్న కొందరి వాదనతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి అన్యాయం..

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపులంటే అంతే. రాజకీయ నాయకులకు అదో క్రీడ.. అవసరమున్న వాడుకోవడానికి అదో తాయిళం. ఎన్నికల వేళ అదో మత్తు మహత్యం.. హామీల అల్ప సంతోషం.. అంత వరకే. అవి వచ్చేవి లేదు. అలా ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిందే.…

పదిసార్లు ఫోన్​ చేస్తే కానీ, వర్తమానం పంపితే కానీ రాని ముఖ్య అతిథులతో సభలు, సమావేశాలు నడుస్తున్న కాలంలో 81 ఏండ్ల విశ్వనాథ్ గారి కమిట్​మెంట్​కు శిరస్సానమామి…..ఓ కళాతపస్వి..! నీ యాదిలో గుండె బరువైతున్నది…

2011 జనవరి 29… హైదరాబాద్ లోని రవీంద్రభారతి వేదిక. వేటూరి జయంతి.. ‘గురూజీ మళ్లీ ఎప్పుడు కలుద్దాం’.. పుస్తకావిష్కరణ. సాయంత్రం 5 గంటలకు ప్రోగ్రాం మొదలు కావాలి. అంతకు పది పదిహేను నిమిషాల ముందే అక్కడికి వచ్చి కూర్చున్నారు కె.విశ్వనాథ్ గారు.…

రోజురోజుకూ జర్నలిజాన్ని ఎంత క్యామెడీ చేస్తున్నర్రా భయ్..బొర్ర బాధితుల సంఘం, తెల్లెంటికల బాధితుల సంఘాలను కూడా ఏర్పాటు చేయాలి..

#ఇన్నారుళ్లా రోజురోజుకూ జర్నలిజాన్ని ఎంత క్యామెడీ చేస్తున్నర్రా భయ్.. ఎంత గొప్ప సంఘం ఎంత గొప్ప ఎన్నికలు.. నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్న లీడరునే మొదటి అధ్యక్షుడిగా ఎన్నుకున్నరట.. ఇంతపెద్ద మండల సంఘానికి ఒక ‘సభ్యున్ని’ కూడా ఎన్నుకున్నరట.. డిమాండ్ నెరవేరకుంటే జిల్లా…

షాకింగ్‌.. బ్రేకింగ్‌ ఉంటే తప్ప వార్తలు చదవరా..? సంచలన వార్తల కోసం పాపం మీడియాకు ఎన్ని తిప్పలో….! ఎవరికి తోచింది వారు రాసుకోవచ్చు..

వార్తలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పద్దతులు మారాయి. చెప్పే విధానం మారింది. హెడ్డింగ్‌ షాకింగ్‌గా ఉండాలి. అప్పుడే అది బ్రేకింగ్‌ అవుతుంది. నలుగురినీ చదివిస్తుంది. చప్పటి వార్తలు ఎవడికి కావాలి. మసాలా జోడించాలి. ఆసక్తి పేరుతో మమనే కొంచెం సంచలనం టచ్‌…

ఈ ఇందూరు స్టూడెంట్స్‌…. గ్రేట్‌ రైటర్స్‌…రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలో చదువుతూ… అద్బుత నవలలకు అక్షరాలు ఏర్చి కూర్చిన 12 మంది విద్యార్థినులు…హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లో ప్రదర్శన… అద్బుత రచనలకు అచ్చెరువొందిన పుస్తక ప్రియులు.. విద్యార్థినులతో మంత్రి ఇంటరాక్ట్‌… ప్రశంసలు.. కలసి భోజనం చేసిన వేముల..

మట్టిలో మాణిక్యాలు వీరు… చదివేది ప్రభుత్వ సోషల్‌ వెల్పేర్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలో. చదివేది ఎక్కడైతే ఏందీ..? వారిలో టాలెంట్‌ను బయటకు తీసింది ఈ ప్రభుత్వ విద్య. పన్నెండు మంది విద్యార్థులు… ఒక్కొక్కరు ఒక్కో కాన్సెప్ట్‌ ఎంచుకున్నారు. అప్పుడప్పుడే అక్షరాలను ఏర్చికూర్చడం…

You missed

ఒక కేటీఆర్‌.. ఒక నమస్తే తెలంగాణ.. తప్పుటడుగులు.. తొమ్మిది మీడియా సంస్థలకు లీగల్‌ నోటీసులు.. నమస్తే ఉద్యోగుల తరుపున పోరాడిన ‘వాస్తవం’ వెబ్‌ మీడియాకూ నోటీసులు పంపిన యాజమాన్యం.. ఉద్యోగులను తొలగిస్తున్నారనే వార్తపై ‘నమస్తే’ యాజమాన్యం యాక్షన్‌.. ఎవరి డైరెక్షన్‌..? నమస్తే తెలంగాణ ఉద్యోగులను పీకి రోడ్డున పారేసింది ‘వాస్తవం’ కాదా..? కేటీఆర్‌ అప్పుడు ప్రేక్షకపాత్ర వహించాడెందుకు..? కేసీఆర్‌ సర్కార్‌ తెలంగాణ జర్నలిస్టులను పట్టించుకోలేదని కోపంతో ఉన్న మీడియా.. ఇప్పుడు ఈ లీగల్‌ నోటీసులిచ్చి ఏం సాధిస్తారు..? తీగుళ్ల కృష్ణమూర్తి వచ్చిన నాటి నుంచి నమస్తే తెలంగాణకు తెగుళ్లు.. మరి ఎందుకు మార్చడం లేదు.. ఎవరి చేతిలో ఈ పేపర్ ఉన్నది.. ?