ఎక్క‌డైనా.. ఎవ‌రైనా…… ఓ ఉద్యోగ ప్ర‌క‌ట‌న ఇస్తే….క్వాలిఫికేష‌న్‌.. అనుభ‌వం… వ‌య‌స్సు అన్ని కండిష‌న్లు పెట్టి….. చివ‌ర‌కు ఆ ఉద్యోగానికి జీతం ఎంతో కూడా చెప్పేస్తారు. కానీ ఒక్క విలేక‌రిగిరీ ఉద్యోగానికి మాత్రం జీతం ఎంతో చెప్ప‌రు. అన్ని ప‌త్రిక‌లు, చానెళ్ల ప‌రిస్థితీ ఇంతే. ఎవ‌రైనా స‌రే ఇందుకు మిన‌హాయింపు కాదు. 30 ఏండ్లు లోపే ఉండాల‌ట‌. డిగ్రీ చేయాల‌ట‌. తెలుగు భాష మీద మంచి ప‌ట్టు ఉండాల‌ట‌… ఇంకా ఏమోమో అడుగుతారు అప్ప‌నంగా. అదేదో క‌లెక్ట‌ర్ ఉద్యోగానికి ఇచ్చిన బిల్డ‌ప్ ఇస్తారు. చివ‌ర‌కు జీతం ఎంతో మాత్రం చెప్ప‌రు. ఆ ఒక్క‌టి అడ‌క్కు అంటారు. తీరా ఆ ఉద్యోగానికి కొత్త ముఖాలు వెళ్లి అడిగితే.. జీతం మాట‌టుంచి వీళ్లు ఊరు మీద ప‌డి ఎంత దోచివ్వాలో చెప్పి … అందులోంచే జీతం అంటారు.

ఒక‌వేళ జీతం ఇంత అని ఎంతో కొంత విదిలించి … అందుకు వెయ్యి రెట్లు గొడ్డు చాకిరీ చేయించుకుంటారు. అద‌న్న‌మాట మీడియా లో ప‌రిస్థితి. దుస్తిది. ఎంత చిన్న నౌక‌రీ అయినా….జీతం ఇంతిస్తామ‌ని చెబుతారు. ఇందులో మాత్ర‌మే చెప్ప‌రు. అదీ దీని స్పెషాలిటీ. పెద్ద ప‌త్రిక‌ల‌ని ఢంకా బ‌జాయించుకునే ఈనాడు నుంచి మొద‌లుకొని అన్ని ప‌త్రిక‌ల‌వీ ఇదే దారి. ఈ మ‌ధ్య‌యితే భారం త‌గ్గించుకునేందుకు ఉన్న ఉద్యోగాలే పీకేశాయి. అందులోనూ ఏదీ మిన‌హాయింపుకాదు… అధికార పార్టీ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌తో స‌హా. చెప్పాలంటే అన్నింటిక‌న్నా ఉద్యోగాల‌ను పీకేయ‌డంలో ఉద్యోగుల‌ను రోడ్డు పాలు చేయ‌డంలో న‌మ‌స్తే తెలంగాణే ముందుంది అన్నింటిక‌న్నా…….

You missed