దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

నమస్తే తెలంగాణలో కీలక మార్సులు జరగబోతున్నాయి. బీఆరెస్‌ ప్రభుత్వం పోయిన తరువాత ఆ ప్రతికలో చాలా మార్పులు వచ్చాయి. ఉద్యోగులు కూడా తగ్గిపోయారు. తగ్గించేశారు. ఇప్పుడు అంతకు మంచి మార్పు జరగబోతోంది. ఏకంగా ఎండీ దామోదరరావునే పక్కన పెట్టాలని కేసీఆర్‌ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కొత్తగా ఎండీ బాధ్యతలు సంతోష్‌రావుకు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సంతోష్‌రావు రాకతో ఎలాంటి మార్పులు జరుగుతాయనేది సర్వతా చర్చనీయాంశం కానుంది. అయితే ఎడిటర్‌ తీగుళ్ల కృష్ణమూర్తి వ్యవహారం పైనా బీఆరెస్‌ పార్టీ అధినేత, కేటీఆర్‌ ఆగ్రహంతో ఉన్నారు. ఎండీ మార్పుతో పాటు ఎడిటర్‌ మార్పు కూడా అనివార్యమనేది క్లారిటీ. మరి ఎవరిని ఎడిటర్‌ చేస్తారు..? అనేది చర్చకు వస్తోంది. ఇప్పుడు నెట్‌వర్క్‌ ఇంచార్జిగా ఉన్న ఎస్జీవీ శ్రీనివాసరావును ఎడిటర్ చేస్తారనేది ఓ ప్రచారం నడుస్తున్నది. సవాల్‌రెడ్డి పేరుతో ఆర్టికల్స్‌ రాసే ఎస్జీవీ.. వెలమ సామాజికవర్గం. మంటికి పోయినా ఇంటోడు కావాలనేదాన్ని అమలు చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టున్నాడు. అందుకే ఎప్పటి నుంచో కాచుక్కూర్చున్న ఎస్జీవీకి ఇలా కాలం కలిసి వచ్చే చాన్స్‌ ఉంది.

 

 

You missed