దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: మొన్న నమస్తే తెలంగాణలో పెద్ద వార్తొకటొచ్చింది. ‘టీఎస్‌పీఎస్సీలో ఆంధ్ర సభ్యడ’ని. ఈ వార్త చూసి నమస్తే తెలంగాణ సిబ్బంది, ఉద్యోగులు, జర్నలిస్టులు నవ్వుకున్నారు. నమస్తే తెలంగాణకు ఎడిటర్‌గా తీగుళ్ల కృష్ణమూర్తిని తీసుకొచ్చి పెట్టిన తరువాత ఆంధ్ర ఉద్యోగులతో నింపిన ఈయన ఇవాళ ఆంధ్ర ఉద్యోగి గురించి రాయడం ఓ వింత.

దాదాపు రెండొందల మంది నమస్తే తెలంగాణ జర్నలిస్టులను, అందులో ఉద్యోగులను రోడ్డున పడేసి.. జీతాలు రెండింతలు, మూడింతల పెంచి ఆంధ్రోళ్లను కోబ్రా (కోస్తా బ్రాహ్మణుల)ను తెచ్చుకుని పెట్టుకుంది నువ్వు కాదా.. కృ.తి. జనార్ధన్‌, సూర్య, సత్యనారాయణ స్వామి ఎక్కడి వాళ్లు..? వీళ్ల జీతాలెందుకు అమాంతం పెంచి ఇచ్చావు…? అప్పటి వరకు పనిచేసిన తెలంగాణ జర్నలిస్టులను అవమానించి వాళ్లు వెళ్లిపోయేలా చేసి.. బదిలీల పేరుతో వారి జీవితాలతో ఆడుకున్న నువ్వు నమస్తే తెలంగాణలో చేసిన విధ్వంసం అంతాఇంతా కాదు. మరి ఇవాళ నీతులు చెప్పేందుకు ఆంధ్ర అనే పదం వాడుతున్నావు…? ఇప్పడిదే నమస్తే తెలంగాణలో చర్చించుకునే టాపిక్. కేసీయారే నాకు చెప్పాడు.. మొత్తం బ్రాహ్మణులతో నమస్తేను నింపాలని బాజాప్తా బహిరంగంగానే చెప్పుకుంది నువ్వు కాదా..? ఎడిట్‌ పేజీలో వ్యాసాలన్నీ కోబ్రాలవే ఉండాలని హుకుం జారీ చేసింది నువ్వు కాదా..?

టీ న్యూస్‌ పెత్తనమంతా అప్పగించిన ఎన్‌టీవీ శాస్త్రి ఏ ప్రాంతం వాడు..? టీన్యూస్‌ ఇన్‌పుట్ ఎడిటర్‌గా నియమించుకునేలా చేసిన ఇలపావులూరి ఏ ప్రాంతం వాడు…? తెలంగాణ జర్నలిస్టులకు భాష రాదు.. న్యూస్‌ చదవరాదు.. ఏదీ ఓసారి నా ముందు చదివి వినిపించండని శాస్త్రి చేసిన అవహేళన, అవమానాలు మరిచిపోయారనుకుంటున్నావా..? సమ్మెలు చేసిన ఉదంతాలు బయటకు రాలేదేమో.. కానీ తెలంగాణ జర్నలిస్టులకు తెలుసు. ఇంత జరుగుతున్నా.. మేనేజ్‌మెంట్‌తో కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావులతో సంబంధాలున్న నెట్‌వర్క్‌ ఇంచార్జి, అసిస్టెంట్‌ ఎడిటర్‌ ఎస్జీవీ శ్రీనివాస రావు ఇంత జరుగుతున్నా అర్బకుడిగా ప్రేక్షకపాత్ర వహించాడు. తన ఉద్యోగానికి ఎసరు రాగానే మేనేజ్‌మెంట్‌ వద్దకు పరిగెత్తాడు. ఎస్జీవీ దృష్టిలో టీన్యూస్‌ ఉద్యోగులు, వీక్షకులు, నమస్తే తెలంగాణ ఉద్యోగులు, పాఠకులు, ప్రజలు అందరూ అర్బకులే అనుకున్నారు. ఇది భజన బృందం నమ్మింది. కానీ ఈ అర్బకులే తమ బలమేమిటో నిరూపించుకున్నారు. టీఆరెస్‌ ఓడిపోవడానికి వీళ్లంతా కారకులే. కానీ వారికి సోయి లేదు… వీరికి సోయి లేదు.

నమస్తే తెలంగాణకు కృ.తి తెచ్చుకున్న ఆంధ్ర ఉద్యోగులకు తెలంగాణ గురించి ఏమి తెలియదు. ఉత్సవ విగ్రహాల్లా కూర్చుని అందరి మీద నిఘా వేయడమే వీరి పని. పనిచేయడం తెలంగాణ ఉద్యోగులవంతు.. ఈ ఆంధ్ర ఉద్యోగులకు తెలంగాణ గురించి తెలుసుకోవాల్సిందిగా తెలంగాణ పుస్తకాలు చదవాలని చెప్పింది నువ్వు కాదా కృ.తి..? దీని కోసం నందినీ సిధారెడ్డిని ప్రత్యేకంగా తెలంగాణ పుస్తకాల లిస్టు పంపాలని కోరింది నువ్వు కాదా..? ఆయన ఓ వంద పుస్తకాల పేర్లు పంపింది వాస్తవం కాదా..?

You missed