ఫుడ్ పాయిజ‌న్‌తో త్రిపుల్ ఐటీ విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు లోనై నిజామాబాద్ ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తే ఇక్క‌డి పోలీసుల ఓవ‌రాక్ష‌న్ ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న‌కు ఊతమిచ్చింది. ఎమ్మెల్సీ క‌విత విద్యార్థుల చికిత్స విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకున్న‌ది. జాగృతి టీమ్‌ను అల‌ర్ట్ చేసింది. వైద్యులు స‌కాలంలో స్పందించారు. 30 మంది విద్యార్థుల్లో 21 మంది డిశ్చార్జి అయ్యి వెళ్లిపోయారు కూడా. మ‌రో 9 మంది మాత్ర‌మే ఉన్నారు. వీరిని అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచి కొన్ని గంట‌ల్లో డిశ్చార్జి చేయాల్సి ఉంది. కానీ అప్ప‌టికే స్టూడెంట్ లీడ‌ర్లు రంగంలోకి దిగి ఆందోళ‌న చేప‌ట్టారు.

లోప‌ల ఉన్న విద్యార్థుల‌ను చూస్తేగానీ మాకు న‌మ్మ‌కం లేద‌ని అన‌డంతో ఏఐఎస్ఎఫ్‌, పీడీఎస్‌యూ విద్యార్థుల‌ను లోప‌ల‌కి పంపి చూపించారు. అంతా ఓకే. ఆందోళ‌న స‌ద్దుమ‌ణిగింది. ఆ త‌ర్వాత ఎన్ఎస్‌యూఐ రంగంలోకి దిగింది. వీరిని పంప‌లేదు పోలీసులు. ఇక్క‌డే వ‌చ్చింది అస‌లు తంటా. పెద్ద లొల్లి . బ‌ల్మూరి వెంక‌ట్‌ను పిలిపించారు. గొడ‌వ చేశారు. ఇప్పుడు మ‌రింత పెద్ద ఇష్యూ అయి కూర్చుంది ఇది. మొన్న వ‌స‌తులు క‌ల్పించండ‌ని విద్యార్థుల ఆందోళ‌న‌కు దిగితే హోం మినిష్ట‌ర్ ఇది పెద్ద స‌మ‌స్యే కాదు.. రాజ‌కీయం చేయ‌కండి అని అన‌డం పెద్ద వివాద‌మ‌య్యింది. ఇది మ‌రిచిపోక ముందే విద్యార్థుల అస్వ‌స్థ‌త‌, పోలీసుల ఓవ‌రాక్ష‌న్ కాస్త అధికార పార్టీకి మ‌రింత ఇబ్బందిక‌రంగా మారింది.

బీజేపీ ఈ సంఘ‌ట‌న‌ను తమ‌కు అనుకూలంగా మ‌ల‌చుకోవ‌డంలో స‌క్సెస‌య్యింది.

You missed