వీడ్కోలు మై డియర్ జమీర్….

We miss u….

విధుల్లో నీకు నీవే సాటి జమీర్. జర్నలిజాన్ని బాధ్యతగా తీసుకునేవాళ్లలో జమీర్ ముందు వరుసలో ఉంటారు. కనీసం జీతాలు రావు….కంట్రిబ్యూటర్ కు నెలా నెలా కూడా యాజమాన్యాలు ఇవ్వలేం… రోజువారి ప్రయాణ భత్యాలు కూడా చెల్లించుకోలేని స్థితిలో ఉన్న నీ లాంటి పేదవాడికి ఈ వృత్తి తగదని ఎంత సర్ధి చెప్పినా…జర్నలిజం నా పాషన్ సర్ అని నెల రోజులు కరీంనగర్ కు తిరిగాడు. జగిత్యాల ప్రాంతానికి చెందిన సూర్యం గారు (ఎంఎస్వో ) సిఫారసు మేరకు జమీరుకున్న ఇష్టాన్ని, వృత్తి పట్ల ఉన్న నిబద్దను గుర్తించి ఎన్ టి వి జగిత్యాల కంట్రిబ్యూటర్ గా లో చేరాడు. చేరినరోజునుండి ఏదో ఒక బ్రేకింగ్ ఇవ్వాలి…వార్త సేకరణలో ఎలక్ట్రానిక్ మీడియాకు తగట్టుగా వార్తలివ్వాలనే తపనతో దశాబ్దంపాటు పనిచేస్తున్నారు.

జగిత్యాల చుట్టూ ఆరోజుల్లో ఎన్ టి వి లో వచ్చిన ప్రతీ బ్రేకింగ్ సమాచారం జమీర్ దే. గల్ప్ కష్టాల ఇతిబాధలు, మూడనమ్మకాల జాడ్యంతో పాటు జగిత్యాల పల్లెల్లో జరిగే ప్రతీ సమాచారాన్ని ముందే చేరవేసేవారు. ఇటీవలి కోవిడ్ సమయంలో కూడా ఒక జర్నలిస్ట్ గా అత్యంత దైర్య సాహాసాలతో వార్త కవరేజీలో ముందున్నారు. ఒక దశలో పిపిఈ కిట్లు లేకుండా కోవిడ్ వార్డుల్లో కెమెరా పట్టుకుని తిరిగాడు. ఇటీలి ఘటన చూస్తే జమీర్ చాల మొండిగా దైర్యంగా వరదలో ప్రయాణం చేశారు. తన తోటి ఒకరిద్దరు జర్నలిస్ట్ మిత్రులు ఆ రాత్రి సహాయ శిబిరం(ఒక బడి)లో నిద్రించి తెల్లారి వారి ఇండ్లకు చేరుకున్నారు. కాని నాకు ఏమి కాదులే అనే మొండి దైర్యం జమీర్ ప్రాణాలమీదకు తీసుకొచ్చింది. పేద ముస్లీం కుటుంభానికి చెందినప్పటికీ ఎక్కడా తగ్గకుండా తోటి జర్నలిస్ట్ లతో కలివిడితో ఉంటూ తన దైన మార్కును వేసుకున్నారు.

ఇప్పటికీ ప్రతీ సందర్భంలోనూ నాకు ఫోన్లు చేసి యోగ క్షేమాలను గుర్తు చేసుకునే ఇలా విధి నిర్వహణలో వరదల్లో చిక్కుకుని అందరికీ దూరం కావడం దురదృష్టకరం. ఎన్టీవి లోనే దాదాపు పదేండ్లుగా పనిచేస్తున్న జమీర్ కుటుంబాన్ని ఆ యాజామాన్యం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. వార్త సేకరణ కోసం విధి నిర్వహణలో అమరుడైన జమీర్ కు తెలంగాణ మీడియా అకాడమి కూడా అండగా నిలునాల్సిన అవసరం ఉందని గుర్తూ చేస్తూ…..జమీర్ వి మిస్ యూ….

Venkat Guntipalli

You missed